తెలంగాణ

telangana

ETV Bharat / international

పుతిన్‌ కీలక ప్రకటన.. ఉక్రెయిన్‌లో తాత్కాలిక కాల్పుల విరమణ.. కారణమదేనా? - Temporary ceasefire in Ukraine on January 6

ఉక్రెయిన్‌లో తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని పుతిన్​ నిర్ణయించారు. రష్యాలో క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో దేశాధ్యక్షుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, రష్యాతో ఉక్రెయిన్​లోను కొంతమంది జనవరి జనవరి 7న ఆర్థడాక్స్‌ క్రిస్మస్‌ జరుపుకుంటారు.

temporary-ceasefire-between-ukraine-and-russia-due-to-orthodox-christmas
క్రిస్మస్‌ కారణంగా ఉక్రెయిన్​పై రష్యా యుద్ధ విరమణ

By

Published : Jan 6, 2023, 6:35 AM IST

Ukraine Russia Crisis: రష్యాలో క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో దేశాధ్యక్షుడు పుతిన్‌ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌లో తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని తన సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. 'రష్యా ఆధ్యాత్మిక గురువు పాట్రియార్క్ కిరిల్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని.. స్థానిక కాలమానం ప్రకారం జనవరి 6న మధ్యాహ్నం 12 గంటలనుంచి జనవరి 7న అర్థరాత్రి 12 వరకు 36 గంటలపాటు కాల్పుల విరమణ పాటించాలని రష్యా రక్షణ మంత్రిని పుతిన్‌ ఆదేశించారు' అని క్రెమ్లిన్‌ తెలిపింది. ఇదిలా ఉండగా.. ప్రపంచంలో దాదాపు అన్నిచోట్ల డిసెంబరు 25నే క్రిస్మస్‌ జరిపితే.. రష్యాలో తేదీ భిన్నంగా ఉంటుంది. రష్యాతోపాటు ఉక్రెయిన్‌లోనూ కొంతమంది జనవరి 7న ఆర్థడాక్స్‌ క్రిస్మస్‌ చేసుకుంటారు.

మరోవైపు.. ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు దిశగా చర్చల విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తన ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్‌లో తాము స్వాధీనం భూభాగాలను రష్యాలో అంతర్భాగమని అంగీకరిస్తే ఆ దేశంతో చర్చలకు సిద్ధమని తెలిపారు. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌తో ఫోన్‌లో సంభాషణ సందర్భంగా పుతిన్‌ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది. పశ్చిమ దేశాల ఆయుధ సాయంపైనా మండిపడినట్లు తెలిపింది. ఈ సందర్భంగా.. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు ఎర్డోగన్‌ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్‌, జపోరిజియా, లుహాన్స్క్‌, దొనెట్స్క్‌ ప్రాంతాలను రష్యా.. తమ దేశంలో ఏకపక్షంగా విలీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఈ ప్రాంతాలపై రష్యాకు పూర్తిస్థాయిలో పట్టులేదు.

ABOUT THE AUTHOR

...view details