దక్షిణాఫ్రికాలో పేలిన గ్యాస్ ట్యాంకర్.. తొమ్మిది మంది మృతి - south africa explosion
దక్షిణ ఆఫ్రికాలోని బోక్స్‌బర్గ్ పట్టణంలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ ట్యాంకర్ పేలి తొమ్మిది మంది మరణించారు.
south africa explosion
దక్షిణ ఆఫ్రికాలోని బోక్స్‌బర్గ్ పట్టణంలో శనివారం గ్యాస్ ట్యాంకర్ పేలి తొమ్మిది మంది మరణించారు. ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారో ఇంకా తెలియలేదు. ఎత్తు తక్కువగా ఉన్న ఓ రైల్వే బ్రిడ్జ్ కింద నుంచి గ్యాస్ ట్యాంకర్ వెళ్లింది. దీంతో అక్కడ ఇరుక్కుపోయిన ట్యాంకర్ ఒక్కసారిగా పేలింది. మరణించిన వారిలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో బ్రిడ్జ్ పూర్తిగా ధ్వంసం అయింది. పక్కనే ఉన్న ఆసుపత్రి, రెండు గృహాలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు.