పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రసిద్ధ సూఫీ మందిరానికి వెళ్తున్న ఓ వ్యాన్.. జాతీయ రహదారి పక్కన ఉన్న గుంతలో బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 20 మంది భక్తులు మరణించారు.
పాక్‌లో ఘోర ప్రమాదం.. గుంతలో బోల్తాపడ్డ వ్యాన్.. 20 మంది భక్తులు దుర్మరణం - పాకిస్థాన్ లెటెస్ట్ న్యూస్
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో దుర్ఘటన జరిగింది. నిండా నీరు ఉన్న ఓ గుంతలో వ్యాన్ బోల్తాపడగా అందులో ఉన్న 20 మంది భక్తులు మృతిచెందారు.
20 Killed In Van Accident As Record Floods Haunt Pakistan
పోలీసుల వివరాల ప్రకారం.. ప్రసిద్ధ సూఫీ మందిరానికి వెళ్లేందుకు 20 మందికి పైగా భక్తులు వ్యాన్‌లో బయలుదేరారు. అయితే ఆ వాహనం ఖైర్‌పూర్ నుంచి సెహ్వాన్ షరీఫ్ వైపు వెళ్తున్న సమయంలో వరద నీటి కోసం ఏర్పాటు చేసిన గుంతలో బోల్తాపడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో 12 మంది చిన్నారులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
ఇదీ చదవండి:
Last Updated : Nov 18, 2022, 1:17 PM IST