Russia Goodbye ISS: 2024 తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వైదొలగనున్నట్లు రష్యా ప్రకటించింది. సొంత ఆర్బిటింగ్ అవుట్‌పోస్టును నిర్మించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రష్యా అంతరిక్ష కార్పొరేషన్ రోస్కోస్మోస్ కొత్త చీఫ్ యూరి బోరిసోవ్ వెల్లడించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర ప్రాజెక్టు నుంచి వైదొలిగే ముందు రష్యా తన బాధ్యతలను నెరవేర్చే వెళ్తుందని తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా, పశ్చిమ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ రష్యా తీసుకున్న నిర్ణయం కీలకంగా మారింది. ఇప్పటివరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కనీసం ఒక రష్యా వ్యోమగామి, ఒక అమెరికా వ్యోమగామి ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అమెరికా, రష్యా, ఐరోపా దేశాలు, కెనడా భాగస్వామ్యులుగా ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఇప్పటివరకు అంతరిక్ష కేంద్రం కార్యకలాపాలపై పడలేదు. సొంత అంతరిక్ష కేంద్ర నిర్మాణాన్ని చైనా దాదాపుగా పూర్తి చేసిన వేళ రష్యా కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.