Ukraine Russia war end: రష్యా-ఉక్రెయిన్ మధ్య టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన చర్చలు ఫలప్రదంగా సాగాయి. యుద్ధం ముగింపు దిశగా అడుగులు వేసేలా రెండు దేశాల మధ్య కీలక ఏకాభిప్రాయం కుదిరింది. రాజధాని కీవ్ సహా మరో ప్రధాన నగరమైన చెర్నిహివ్‌లో సైన్యాన్ని తగ్గిస్తామని రష్యా ప్రకటించింది.
అంతకుముందు జరిగిన కొన్ని ముఖాముఖి చర్చలు విఫలమైన నేపథ్యంలో శాంతి చర్చలపై ఉక్రెయిన్‌కు మరింత భరోసా కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ సహాయ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్ తెలిపారు. ఇస్తాంబుల్ చర్చల తర్వాత.. పుతిన్, జెలెన్స్కీ సమావేశం అయ్యే అవకాశం ఉందని ఉక్రెయిన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య యుద్ధం ముగింపు, ఉక్రెయిన్ భద్రత వంటి అంశాలే లక్ష్యంగా ఇస్తాంబుల్‌లో చర్చలు జరిగినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు వివరించారు.