తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా డ్రోన్లపై నిప్పులు కురిపించిన రష్యా జెట్లు.. 24 గంటల్లో రెండో సారి.. - రష్యా జెట్​ అమెరికా డ్రోన్

Russian Jet With US Drone : సిరియాలో ఆపరేషన్ చేస్తున్న అమెరికా డ్రోన్ల సమీపానికి దూసుకొచ్చాయి రష్యా ఫైటర్​ జెట్లు. 24 గంటల వ్యవధిలోనే రెండు సార్లు డ్రోన్ల సమీపానికి వచ్చాయి.

russia jet fighter news
russia jet fighter news

By

Published : Jul 7, 2023, 10:19 AM IST

Russian Jet With US Drone : సిరియాలో అమెరికా, రష్యా వాయుసేనల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. అమెరికాకు సంబంధించిన డ్రోన్లపైకి రష్యా ఫైటర్​ జెట్లు మరోసారి దూసుకొచ్చాయి. సిరియాలో ఆపరేషన్​ చేస్తుండగా.. 24 గంటల వ్యవధిలోనే రెండుసార్లు దూసుకొచ్చాయని అమెరికా వాయుసేన తెలిపింది. రష్యా ఫైటర్‌ ఎస్‌యూ-34 ఫైటర్‌ జెట్లు వాటి సమీపం నుంచి ప్రమాదకరంగా వెళ్లడమే కాకుండా.. మంటలు రాజేసి ఎంక్యూ-9 రీపర్ల సామర్థ్యం దెబ్బతినేలా చేశాయని తెలిపింది. రష్యా జెట్లను తప్పించుకునేందుకు అనేక విన్యాసాలు చేయాల్సి వచ్చిందని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను అమెరికా వాయుసేన విడుదల చేసింది.

"సిరియాలో మా మూడు డ్రోన్లు ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌నకు సంబంధించి ఓ రహస్య ఆపరేషన్‌ చేస్తున్నాయి. ఇదే సమయంలో మూడు రష్యా విమానాలు అదేపనిగా వాటిని వెంటాడాయి. ఓ రష్యా పైలట్‌ నిర్వాకం వల్ల మంటలు చెలరేగి.. మా రీపర్‌ పనితీరు దెబ్బతింది. ఇలాంటి నిర్లక్ష్య ప్రవర్తనను మానుకోవాలని రష్యా దళాలను కోరుతున్నాం. వాయుసేన వృత్తిపరమైన ప్రమాణాలను పాటించాలి. తద్వారా మేము సిరియాలో ఐసిస్​ను అంతం చేసేందుకు మా దళాలు దృష్టి సారిస్తాయి."
-అలెక్స్‌ గ్రెన్‌కెవిచ్‌, పశ్చిమాసియా 9వ వాయుసేన కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌

మొదటి ఘటన బుధవారం ఉదయం 10.40 గంటలకు జరిగింది. రెండో ఘటన గురువారం ఉదయం 9.30 గటంలకు వాయవ్య సిరియాలో జరిగింది. ఈ డ్రోన్లలో ఎలాంటి ఆయుధాలు ఉండవు. కేవలం నిఘా వ్యవస్థల కోసం వీటిని ఉపయోగిస్తారు. ఈ ఘటనపై స్పందించారు అమెరికా సెంట్రల్ కమాండ్​ హెడ్​ జనరల్ ఎరిక్​ కురిల్లా. తమ ప్రయత్నాలను రష్యా అడ్డుకోవడం వల్ల సిరియా గగనతలంలో మరింత ముప్పును పెంచుతోందని చెప్పారు.

అమెరికా డ్రోన్​ను కూల్చివేసిన రష్యా
అంతకుముందు కూడా అమెరికాకు చెందిన నిఘా డ్రోన్‌ను రష్యా యుద్ధ విమానాలు కూల్చివేసింది. నల్ల సముద్రంలో అమెరికా నిఘా డ్రోన్‌ను రష్యా యుద్ధ విమానాలు కూల్చివేస్తున్న దృశ్యాలను పెంటగాన్‌ విడుదల చేసింది. అమెరికాకు చెందిన MQరీపర్‌- 9 డ్రోన్‌ వైపు రష్యాకు చెందిన రెండు సుఖోయ్‌ యుద్ధ విమానాలు దూసుకొస్తున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైంది. డ్రోన్‌పై రష్యా విమానాలు వెళ్లినప్పుడు వీడియో ప్రసారానికి అంతరాయం కలిగింది. ఎస్​యూ-27 యుద్ధ విమానం.. డ్రోన్‌పై ఇంధనాన్ని విడుదల చేయడం వల్ల డ్రోన్‌ దెబ్బతిందని పెంటగాన్ వివరించింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవీ చదవండి :నడి సముద్రంలో అమెరికాను హడలెత్తించిన రష్యా!

అమెరికా నిఘా డ్రోన్​ను ఢీకొట్టిన రష్యా ఫైటర్ జెట్.. కోల్డ్ వార్ తర్వాత తొలిసారి..

ABOUT THE AUTHOR

...view details