తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికన్ ఇంటెలిజెన్స్​లోకి పాక్​ ఐఎస్​ఐ ఏజెంట్ల చొరబాటు! - అమెరికా భద్రతా సంస్థలు

Pakistan ISI: పాక్​ ఇంటెలిజెన్స్​ ఐఎస్​ఐకి చెందిన ఇద్దరు ఏజెంట్లను అరెస్ట్​ చేశారు అమెరికా అధికారులు. హోంశాఖ అధికారులుగా నమ్మించి భద్రతా సంస్థల్లోకి చొరబడేందుకు యత్నించారని వెల్లడించారు. కానుకలను ఎరగా వేసి పలువురు అధికారులతో పరిచయం పెంచుకునేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.

Pakistan ISI
అమెరికా భద్రతా సంస్థల్లో పాక్​ ఏజెంట్ల చొరబాటు!

By

Published : Apr 8, 2022, 10:44 AM IST

Pakistan ISI: అమెరికా భద్రతా సంస్థల్లోకి చొరబడేందుకు పాకిస్థాన్​ నిఘా​ విభాగం ఐఎస్​ఐ విఫలయత్నం చేసింది. ఇందుకు సంబంధించి ఐఎస్​ఐ ఏజెంట్లుగా పేర్కొంటున్న ఇద్దరిని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్​బీఐ అరెస్ట్​ చేసింది. నిందితులను అరియన్​ తహేర్​జాదే (40), హైదర్​ అలీ (35)గా అధికారులు గుర్తించారు. అలీకి పాకిస్థాన్​, ఇరాన్​ నుంచి వివిధ దేశాలకు వీసాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

అధికారులుగా నమ్మించి.. హోంశాఖకు చెందిన అధికారులుగా అందరినీ నమ్మించిన ఏజెంట్లు.. రక్షణ శాఖ వంటి కీలక విభాగాలకు చెందిన వారితో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా యునైటెడ్​ స్టేట్స్​ సీక్రెట్​ సర్వీస్​కు ​(యూఎస్​ఎస్​ఎస్​) చెందిన పలువురితో పాటు హోంశాఖకు చెందిన ఓ అధికారికి కానుకలు ఇచ్చారు. అపార్ట్​మెంట్లు, ఐఫోన్లు, టీవీ, డ్రోన్​, అసాల్ట్​ రైఫిల్​ కేస్​, జెనరేటర్​ వంటి వస్తువులను బహూకరించారు. ఇందుకు అదనంగా అధ్యక్షుడు జో బైడెన్​ సతీమణి జిల్​ బైడెన్​ భద్రతా బృందంలో ఒకరైన యూఎస్​ఎస్​ఎస్​ ఏజెంట్​కు 2000 డాలర్లు విలువ చేసే అసాల్ట్​ రైఫిల్స్​ను విక్రయించేందుకు ప్రయత్నించారు.

చుట్టూ నిఘా..తాము నివసించే ప్రాంతంలో కూడా నిందితులు సీసీటీవీలను ఏర్పాటు చేశారు. వాషింగ్​టన్​లోని ఆ అపార్ట్​మెంట్​ కాంప్లెక్స్​లోని వారికి తాము ఉన్నతాధికారులమని నమ్మించారు. నివాసితుల ఫోన్లను ఏ సమయంలోనైనా ఉపయోగించుకునే అధికారం తమకు ఉందని చెప్పుకొచ్చారు. దర్యాప్తులో భాగంగా త్వరలో దీనిని కుట్రగా కూడా పరిగణించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి :భారతీయులకు గుడ్ న్యూస్- బైడెన్​ ఆమోదంతో ఇకపై..!

ABOUT THE AUTHOR

...view details