తెలంగాణ

telangana

ETV Bharat / international

99 శాతం మంది పీల్చేది కలుషిత గాలే!

New who report: ప్రపంచంలోని దాదాపు 99శాతం మంది నాణ్యత లేని గాలిని పీల్చుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. శిలాజ-ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

new WHO data
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక

By

Published : Apr 4, 2022, 10:00 PM IST

New who report: ప్రపంచ వ్యాప్తంగా 6,000 కంటే ఎక్కువ మున్సిపాలిటీలలో గాలి నాణ్యతకు సంబంధించి సర్వే చేసి.. ఓ నివేదికను విడుదల చేసింది డబ్ల్యూహెచ్​ఓ . ప్రపంచ జనాభాలో 99 శాతం మంది గాలి-నాణ్యత పరిమితులను మించిన నాణ్యత గాలిని పీల్చుతున్నారని ఈ నివేదికలో పేర్కొంది. తరచూ ఊపిరితిత్తులలోకి ఈ గాలి వెళ్లి సిరలు, ధమనులలోకి ప్రవేశించి వ్యాధులకు కారణమవుతోందని డబ్ల్యూహెచ్​ఓ వెల్లడించింది. తూర్పు మధ్యధరా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా తక్కువగా ఉందని.. ఆ తర్వాత ఆఫ్రికాలో తక్కువ ఉందని ఈ నివేదికలో తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో గాలి కాలుష్యం సర్వసాధారణంగా ఉందని, ఈ కాలుష్య గాలిని పీల్చడం వల్ల ఆస్తమా,దగ్గు, గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి వ్యాధుల బారిన పడుతున్నారని నివేదికలో వివరించింది.

వాయు కాలుష్యం కారణంగా సుమారు సంవత్సరానికి 70 లక్షలు మరణాలు సంభవించి ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యావరణ, వాతావరణ మార్పు, ఆరోగ్య విభాగం అధిపతి డాక్టర్ మరియా నీరా అన్నారు. అలాగే ఈ పరిశోధనలు వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన మార్పులు చేయడానికి పనికొస్తాయని దిల్లీలోని వాయు కాలుష్య నిపుణుడు అనుమితా రాయ్‌చౌదరి అన్నారు.

ఇదీ చదవండి:ఇమ్రాన్ ఖాన్ భవితవ్యంపై సుప్రీంకోర్టు తీర్పు వాయిదా

ABOUT THE AUTHOR

...view details