నేపాల్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 68 మంది మృతి చెందారు. మరో నలుగురు గల్లంతయ్యారు. పొఖారా విమానాశ్రయానికి సమీపంలో ల్యాండింగ్‌కు ముందు ఈ విమానం కుప్పకూలిపోయింది. అయితే తాజాగా ఇదే విమానానికి సంబంధించినదిగా చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రమాదం జరిగే కొన్ని క్షణాల ముందు ఈ విమానం గాల్లో నియంత్రణ కోల్పోయి వేగంగా కిందికి పడిపోతున్నట్లు అందులో కనిపిస్తోంది. అనంతరం పెద్ద శబ్దం వినిపించింది. అయితే ఈ వీడియో ఘటనా స్థలానికి కొద్ది దూరంలో ఉన్న ఓ భవనం పైనుంచి తీసినట్లుగా తెలుస్తోంది.
నేపాల్ ఘోర విమాన ప్రమాదం.. లైవ్ వీడియో చూశారా?
నేపాల్‌లో విమానం కూలిన దుర్ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు తీసిన ఆ వీడియోలో ఏముందంటే?
ఆదివారం జరిగిన ఈ దుర్ఘటన కారణంగా నేపాల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం సోమవారం 'జాతీయ సంతాప దినం' ప్రకటించింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి మొత్తం 72 మంది ఉన్నారు. అందులో ఐదుగురు భారతీయులతో కలిపి మొత్తం 15 మంది విదేశీయులు ఉన్నారు. ఈ క్రమంలోనే ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలను ముమ్మరంగా చేశారు. ప్రమాదం నుంచి ఎవరైనా బయటపడ్డారా? అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదని యతి ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి తెలిపారు.