తెలంగాణ

telangana

ETV Bharat / international

అక్కడ 'పానీపూరీ' బ్యాన్​.. ఆ ప్రాణాంతక వ్యాధే కారణం! - nepal cholera disease news

వీధుల్లో విక్రయించే ఆహార పదార్థాలపై నిషేధం విధించారు అధికారులు. నిషేధిత జాబితాలో ఎక్కువమంది అమితంగా ఇష్టపడే పానీపూరీతో పాటు పలు ఇతర ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. ఇంతకీ వాటిని ఎందుకు, ఎక్కడ బ్యాన్​ చేశారంటే?

Nepal imposes ban on sale of street food items like Pani-Puri
పానీపూరీ బ్యాన్​.. ఆ ప్రాణాంతక వ్యాధి కారణం

By

Published : Jun 29, 2022, 2:19 PM IST

Updated : Jun 29, 2022, 3:08 PM IST

నేపాల్ రాజధాని కాఠ్​మండూ, లలిత్‌పుర్​లో పానీపూరీతో పాటు పలు స్ట్రీట్​ ఫుడ్స్​ అమ్మకాలపై నిషేధం విధించారు అధికారులు. ఆయా మెట్రోపాలిటన్ సిటీల్లో కలరా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

వారం రోజులుగా లలిత్‌పుర్​లో కలరా కేసులు భారీగా నమోదువుతుండగా.. తాజాగా ఆ వ్యాధి కాఠ్​మండూకు వ్యాపించింది. ఆదివారం నుంచి ఇప్పటివరకు కాఠ్​మండూ పరిధిలో 12 కలరా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో వ్యాధిని అరికట్టేందుకు అధికారులు అప్రమత్తమై.. ఆంక్షలు విధిస్తున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వీధుల్లో విక్రయించే ఆహార పదార్థాలపై నిషేధం ఉంటుందని స్పష్టం చేశారు.

కలుషితమైన నీరు, ఆహార పదార్థాల ద్వారా కలరా వ్యాపిస్తుంది. ఇది అంటు వ్యాధి. కలరా సోకిన వారికి తీవ్రమైన విరేచనాలు, వాంతులు అవుతాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే.. గంటల్లోనే ప్రాణాంతకం అవుతుంది. అందుకే మొగ్గ దశలో ఉన్నప్పుడే వ్యాధిని కట్టడి చేయాలని అధికారులు భావిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా ఆహార పరిశుభ్రతను తనిఖీ చేయాలని సంబధింత శాఖను అభ్యర్థిస్తున్నారు.

ఇదీ చదవండి:డిసీజ్‌ ఎక్స్‌.. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు..?

Last Updated : Jun 29, 2022, 3:08 PM IST

ABOUT THE AUTHOR

...view details