ట్విట్టర్ కొనుగోలు ఒప్పందానికి ముగింపు పలికే యోచనలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఉన్నట్లు కనిపిస్తోంది. 44 బిలియన్ డాలర్ల విలువైన వాటాను కొనుగోలు చేేసే ప్రక్రియ ఇక ముందుకు సాగనట్లే అనిపిస్తోంది. తాజాగా మస్క్ లీగల్ టీమ్.. ట్విట్టర్‌కు రాసిన లేఖ దీన్ని స్పష్టం చేస్తోంది. ఈ లేఖ ద్వారా ట్విట్టర్‌ను మస్క్ బెదిరించినంత పనిచేశారు. ఏకంగా ట్విట్టర్ డీల్‌నే రద్దు చేయాలనే యోచనలో మస్క్ ఉన్నట్లు లేఖ ద్వారా స్పష్టమవుతోంది. నకిలీ ఖాతాల వివరాలను కోరుతున్నా.. ట్విట్టర్ నిరాకరిస్తూ వస్తోందని ఆ లేఖలో వివరించారు.
'అలా చేస్తేనే ట్విట్టర్ డీల్.. లేదంటే క్యాన్సిల్'.. మస్క్ బెదిరింపు! - Musk
ట్విట్టర్‌ను కొనుగోలు చేసే ఉద్దేశం మస్క్ లేనట్లు కనిపిస్తోంది. తాజాగా టెస్లా లీగల్ టీమ్ రాసిన లేఖ దీన్ని స్పష్టం చేస్తోంది.
నకిలీ ఖాతాల వివరాలు కావాలని మే 9 నుంచి మస్క్ తరచూ కోరుతున్నారని గుర్తు చేశారు. ట్విట్టర్ పేలవ విధానాల గురించి సొంతంగా నిర్ధరించుకునేందుకే మస్క్ సమాచారాన్ని కోరారని ఆయన న్యాయవాదులు వివరించారు. ఈ ఏడాది కుదిరిన విలీన ఒప్పందం ప్రకారం తన సమాచార హక్కును ట్విట్టర్ అడ్డుకుంటోందని ఇటీవల ఆ కంపెనీ తమకు అందించిన సమాచారం ప్రకారం తెలుస్తోందని వెల్లడించారు. ఇది వీలీన ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని తెలిపిన ఎలాన్ మస్క్ న్యాయవాదులు ఒప్పందాన్ని రద్దు చేసుకునే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:'ట్విట్టర్‌తో డీల్ కష్టమే.. అలా చేస్తేనే ముందుకు..!