Madagascar Stampede :మడగాస్కర్ రాజధాని అంటననారివోలో క్రీడా పోటీల సందర్భంగా స్టేడియం వద్ద తొక్కిసలాటజరిగింది. ఈ ఘటనలో 12 మంది చనిపోయారు. సుమారు 80 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని క్రిస్టియన్ ఎన్ట్సే తెలిపారు. మృతుల్లో చిన్నారులు ఉన్నట్లు సమాచారం.
50వేల మందికిపైగా..
Madagascar Latest news :అంటనారివోలో 11వ ఇండియన్ ఓషియన్ క్రీడా పోటీలను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 50,000 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. దీంతో స్టేడియం ముఖద్వారం వద్ద తొక్కిసలాట జరిగింది. సుమారు 80 మంది కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు.. వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఒకరినొకరు తోసుకోవడం వల్లే..
Madagascar Stadium : ఈ క్రీడల పోటీల ప్రారంభ వేడుకలకు హాజరైన మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా.. ఒక నిమిషం మౌనం పాటించాలని ప్రజలందరినీ కోరారు. ఒకరినొకరు తోసుకోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని తెలిపారు. ఈ ఘటన పట్ల సంతాపం తెలియజేస్తున్నట్లు చెప్పారు.
నాలుగేళ్లకోసారి..
గత 40 ఏళ్లుగా నైరుతి హిందూ మహాసముద్ర దీవుల మధ్య పలు విభాగాల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ పోటీలను ఈసారి ఈ మడగాస్కర్‌లో నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 3 వరకు ఇవి జరగనున్నాయి. గతసారి ఈ పోటీలు మారిషస్‌లో నిర్వహించారు.
సాకర్ ఫ్యాన్స్ మధ్య గొడవ.. 125 మంది బలి..
గతేడాది అక్టోబర్‌లో ఇండోనేసియాలో ఇలాంటి ఘటనే జరిగింది. సాకర్ అభిమానుల మధ్య గొడవ ఏకంగా 125 మంది ప్రాణాలు బలిగొంది. అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. తూర్పు జావా రాష్ట్రం మలంగ్ నగరంలో ఇండోనేషియన్ ప్రీమియర్ లీగ్‌లో పెర్సెబాయ సురబాయ జట్టు.. అరెమా మలంగ్ టీమ్‌తో తలపడింది. సుదీర్ఘకాలంగా ప్రత్యర్థులైన ఈ జట్ల అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియంకు వచ్చారు. మ్యాచ్‌ను ఉత్కంఠగా వీక్షించారు. చివరకు పెర్సెబాయ సురబాయ జట్టు.. 3-2 తేడాతో అరెమా మలంగ్ టీమ్‌ను ఓడించింది. ఈ ఫలితం.. రెండు జట్ల అభిమానుల మధ్య ఘర్షణలకు దారితీసింది. ఫ్యాన్స్ ఒక్కసారిగా స్టాండ్స్‌లో నుంచి మైదానంలోకి చొరబడి.. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగందో తెలియాలంటే ఈలింక్పై క్లిక్ చేయండి.