Khalistan Nijjar Killed : ఖలిస్థానీ వేర్పాటువాది, ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) ఏజెంట్ల ప్రేమయం ఉందని స్వతంత్ర బ్లాగర్ జెన్నిఫర్ జెంగ్ ఆరోపణలు చేశారు. కెనడా, భారత్ మధ్య విబేధాలు సృష్టించడమే చైనా ఉద్దేశమని ఆరోపించారు. తైవాన్ విషయంలో చైనా సైనిక వ్యూహానికి అనుగుణంగా ప్రపంచ దేశాల దృష్టి మళ్లించే పథకంలో ఇది భాగమని ఆమె వ్యాఖ్యలు చేశారు.
స్వతంత్ర బ్లాగర్ జెన్నిఫర్ జెంగ్ 'నిజ్జర్ హత్య విషయంలో సీసీపీ ఏజెంట్ల ప్రమేయం'
Hardeep Nijjar Canada News :చైనాలో జన్మించిన జర్నలిస్ట్ జెన్నిఫిర్ జంగ్.. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. ఆమె తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్(అప్పటి ట్విట్టర్)లో వీడియో పోస్ట్ చేశారు. అందులో ఖలిస్థానీ నాయకుడు నిజ్జర్ది హత్యనేని ఆమె వర్ణించారు. "ఈరోజు కెనడాలో సిక్కు మత నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య గురించి దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. నిజ్జర్ హత్య విషయంలో సీసీపీ ఏజెంట్ల ప్రేమయం ఉంది" అని ఆరోపించారు. జెన్నిఫర్ జంగ్.. తన ఆరోపణలను కెనడాలో నివసిస్తున్న చైనీస్ రచయిత, యూట్యూబర్ లావో డెంగ్పై ఆపాదించారు. అయితే జంగ్ ఆదివారం మధ్యాహ్నం (అమెరికా కాలమానం ప్రకారం) పోస్ట్ చేసిన ఈ వీడియోపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు స్పందించలేదు.
"2023 జూన్ ప్రారంభంలో తన ప్లాన్‌లో భాగంగా సీసీపీ.. ఒక ఉన్నత స్థాయి అధికారినిని అమెరికాలోని సియాటెల్‌కు పంపిందని లావో పేర్కొంది. అక్కడ రహస్య సమావేశం జరిగింది. భారత్, పశ్చిమ దేశాల మధ్య సంబంధాలను చెడ్డగొట్టడమే ఆ సమావేశ లక్ష్యం. ఆ తర్వాత సీసీపీ ఏజెంట్లు నిజ్జర్ హత్య ప్రణాళికను అమలు చేశారు. జూన్18వ తేదీన.. సైలెన్స్ గన్లతో సీసీపీ ఏజెంట్లు నిజ్జర్‌ను ట్రాక్ చేశారు. హత్య అనంతరం కారులోని డాష్ కెమెరాను ధ్వంసం చేసి ఘటనాస్థలి నుంచి పారిపోయారు. ఆ మరుసటి రోజే కెనడా నుంచి వారు చైనా బయలుదేరారు. అయితే హంతకులు ఉద్దేశపూర్వకంగానే భారతీయులు మాట్లాడే ఇండియన్ ఇంగ్లిష్‌ను నేర్చుకున్నారు. అలా భారత్‌ను ఇరుకులో పెట్టాలని సీసీపీ ఏజెంట్లు కుట్ర పన్నారు."
--జెన్నిఫర్ జెంగ్, స్వతంత్ర బ్లాగర్
ట్రూడో ఆరోపణలతో..
India Canada Row :నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన సంచలన ఆరోపణలతో రెండు దేశాల మధ్య దౌత్య వివాదానికి తెరలేచింది. ఈ క్రమంలోనే కెనడాలో పనిచేస్తున్న భారత దౌత్యవేత్తపై అక్కడి ప్రభుత్వం బహిష్కరణ వేటువేసింది. దీనికి ప్రతిచర్యగా భారత్ కూడా దిల్లీలోని కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. అంతేకాకుండా కెనడా వాసులకు వీసాల జారీని నిలిపివేస్తూ కూడా భారత్ నిర్ణయం తీసుకుంది.
భారత్ అల్టిమేటంతో..
India Canada Relations :అనంతరం దిల్లీలోని కెనడా దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని ఆ దేశ ప్రభుత్వానికి భారత్ అల్టిమేటం జారీ చేసింది. దీంతో భారత ప్రభుత్వ ఆదేశాలతో కొంతమంది తమ దౌత్యవేత్తలను కెనడా ఇతర దేశాలకు తరలించింది. భారత్‌లో దిల్లీ మినహా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న కెనడా దౌత్యవేత్తలను మలేసియా, సింగపూర్‌కు తరలించింది. అయితే ఎంతమంది దౌత్య సిబ్బందిని భారత్ నుంచి తరలించారనేదానిపై మాత్రం స్పష్టత లేదు.