తెలంగాణ

telangana

ETV Bharat / international

Justin Trudeaus Popularity : పడిపోయిన ట్రూడో పాపులారిటీ.. కెనడా నెక్స్ట్​​ ప్రధాని ఆయనే! - కెనడా ఇండియా వివాదం

Justin Trudeaus Popularity : ఖలిస్తానీ నేత హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్యలో భారత్‌ హస్తం ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు.. ఆ దేశంలో జనాదరణ గణనీయంగా పడిపోయింది. గత యాభైళ్లలో కెనడాలో ఎన్నికైన అత్యంత చెత్త ప్రధాని ట్రూడోనేనని అక్కడి సర్వేలు చెబుతున్నాయి. ట్రూడో రోజురోజుకు కెనడా ప్రజల మద్దతును కోల్పోతున్నారని, ఆయన నాయకత్వ పటిమపై కెనడా ఓటర్లకు విశ్వాసం సన్నగిల్లిందని కెనడాకు చెందిన గ్లోబల్‌ న్యూస్‌ అనే సంస్థ నిర్వహించిన పోల్‌ సర్వేలో తేలింది.

Justin Trudeaus Popularity
Justin Trudeaus Popularity

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2023, 5:54 PM IST

Updated : Sep 22, 2023, 6:44 PM IST

Justin Trudeaus Popularity :కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోపై ఆ దేశ ప్రజల్లో రోజురోజుకి వ్యతిరేక పెరుగుతోంది. ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్యలో భారత్‌పై అసత్య ఆరోపణలు చేసిన ట్రూడోకు కెనడాలో జనాదరణ గణనీయంగా పడిపోయింది. దాదాపు 60శాతం మంది ప్రజలు ట్రూడో పదవి నుంచి వైదొలగాలని కోరుకుంటున్నట్లు ఈ పోల్స్‌లో తేలింది. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ట్రూడోకు ఉన్న పాపులారిటీ పడిపోయిందని,ఇదే సమయంలో ప్రధాని అభ్యర్థి రేసులో ప్రతిపక్షనేత పొయిలివ్రేకు పాపులారిటీ పెరుగుతోందని కెనడాకు చెందిన గ్లోబల్‌ న్యూస్‌ అనే సంస్థ నిర్వహించిన పోల్స్‌ సర్వే పేర్కొంది.ప్రస్తుతం ప్రతిపక్ష నేత పియరీ పొయిలివ్రే వైపు దాదాపు 40శాతం మంది కెనడా ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు సర్వేలో తేలింది.

ట్రూడో నేతృత్వంలోని లిబరల్‌ పార్టీ 30 శాతం ఓట్లకే పరిమితంకానుంది. ప్రస్తుతం ట్రూడో నాయకత్వంలో కెనడా ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.దీనికి తోడు అక్కడి ఆరోగ్య, గృహరంగాల సమస్యల పరిష్కారంలో కూడా ట్రూడో సర్కారు విఫలమైందని సర్వేలో పాల్గొన్న వారు వెల్లడించారు. ఈ మూడు రంగాల్లో ప్రతిపక్ష నేత పియరీ వద్ద మెరుగైన ప్రణాళికలు ఉన్నట్లు పోల్స్‌లో పాల్గొన్నవారు చెబుతున్నారు. జులైలో నిర్వహించిన మరో సర్వేలో గత 50 ఏళ్లలో కెనడా చూసిన అత్యంత చెత్త ప్రధానమంత్రి ట్రూడోనేనని తేలడం గమనార్హం.

Canada Election 2023 :2025లో కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పొయిలివ్రేకు చెందిన కన్జర్వేటివ్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్లు...సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగినా పొయిలివ్రేకు 39 శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నాయి. ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే పొయిలివ్రే పాపులారిటీ 5 శాతం పెరిగినట్లు సర్వేలో తేలింది. మరోవైపు జస్టిన్‌ ట్రూడో ప్రభుత్వానికి ప్రస్తుతం మద్దతు ఇస్తున్న NDP నేత జగ్మీత్‌ సింగ్‌ పాపులారిటీ కూడా నాలుగు శాతం పతనమైంది. ప్రస్తుతం ఆయనకు మద్దతు 26 శాతం నుంచి 22శాతానికి తగ్గినట్లు సర్వేలు చెబుతున్నాయి.

India Cautions Students On Canada : 'కెనడాలోని భారతీయులు జాగ్రత్త'.. కేంద్రం వార్నింగ్​

Canada PM Trudeau Statement : కెనడా కయ్యం.. రెచ్చగొట్టం అంటూనే కశ్మీర్​పై ట్రావెల్​ అడ్వైజరీ.. అమెరికా ఆందోళన

Last Updated : Sep 22, 2023, 6:44 PM IST

ABOUT THE AUTHOR

...view details