Israel Vs Hamas War 2023 :ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాద స్థావరమైన జెనిన్‌లోని అల్-అన్సార్ మసీదుపై వైమానిక దాడులు జరిపింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. పౌరులపై దాడులు జరిపేందుకు ఈ మసీదు నుంచే ఉగ్రవాదులు ప్రణాళికలు రూపొందిస్తున్నారనే సమాచారంతో ఈ దాడులకు పాల్పడింది. దీనిపై తమ ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ అధికారులు ఆదివారం వెల్లడించారు. ఉత్తర ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రమూకలపై ఈ దాడి జరిపినట్లు వారు పేర్కొన్నారు.
ఇద్దరు బందీలను విడిచిపెట్టిన తరువాత తామొక మానవతా సంస్థగా చెప్పుకునేందుకు హమాస్ప్రయత్నిస్తోందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి తెలిపారు. హామాస్.. ఐసిస్ కంటే దారణమైన సంస్థ అనే విషయాన్ని ప్రపంచం మరిచిపొదన్నారు. గాజా స్ట్రిప్ ప్రజలను హమాస్ రక్షణ కవచంగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. పౌరుల మౌలిక సదుపాయాలపై రాకెట్లతో దాడి చేస్తోందని దుయ్యబట్టారు.
గాజాపై దాడులు పెంచేందుకు ప్రణాళికలు..
Israel Strikes Gaza :గాజాపై దాడులను మరింత పెంచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ అధికార ప్రతినిధి తెలిపారు. హమాస్‌పై యుద్ధాన్ని తరువాతి దశకు తీసుకువెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు.