తెలంగాణ

telangana

ETV Bharat / international

అంతర్జాతీయ స్థాయిలో నదీ నౌకా విహారం.. 13న 'ఎంవీ గంగా విలాస్​' ప్రారంభం

ప్రపంచంలోనే అత్యధిక దూరం నదీ యానం చేసే విలాసవంతమైన నౌకగా చరిత్ర సృష్టించనున్న 'ఎంవీ గంగా విలాస్'​ను ప్రధాని మోదీ ఈ నెల 13న ప్రారంభించనున్నారు. దేశంలోని నదుల్లో నౌకా విహారం ద్వారా ప్రముఖ పర్యాటక ప్రదేశాలను, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించటానికి ఈ నౌకను రూపొందించారు.

International level river cruise in india
అంతర్జాతీయ స్థాయిలో నదీ నౌకా విహారం

By

Published : Jan 9, 2023, 7:04 AM IST

Updated : Jan 9, 2023, 7:15 AM IST

దేశంలోని నదుల్లో నౌకా విహారం ద్వారా ప్రముఖ పర్యాటక ప్రదేశాలను, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించటానికి రూపొందించిన 'ఎంవీ గంగా విలాస్‌'ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13న ప్రారంభించనున్నారు. ప్రపంచంలోనే అత్యధిక దూరం నదీ యానం చేసే విలాసవంతమైన నౌకగా ఇది చరిత్ర సృష్టించనుంది. భారత్‌, బంగ్లాదేశ్‌ల పరిధిలోని అయిదు రాష్ట్రాల ద్వారా 27 నదీ మార్గాల్లో 3,200 కి.మీ.దూరం ఈ నౌక ప్రయాణిస్తుంది.

51 రోజుల పాటు కొనసాగే ప్రయాణంలో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నదీ రేవులతో పాటు పట్నా, సాహిబ్‌గంజ్‌, కోల్‌కతా, గువాహటి, బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా వంటి నగరాల్లో ఈ నౌక మజిలీ చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. తొలి విడతలో స్విట్జర్లాండ్‌కు చెందిన 32 మంది విదేశీ పర్యాటకులు ప్రయాణించనున్నారు. ఈ నెల 13న వారణాసి నుంచి బయలుదేరే ఎంవీ గంగా విలాస్‌ మార్చి మొదటి వారంలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న దిబ్రూగడ్‌కు చేరుకుంటుందని వెల్లడించారు.

అంతర్జాతీయ స్థాయిలో నదీ నౌకా విహారం

నౌకలో అంతర్జాతీయ స్థాయిలో విలాసవంతమైన సదుపాయాలను సమకూర్చారు. నదీ పర్యాటకానికి ఉన్న భారీ అవకాశాలను వెలికి తీసే లక్ష్యంలో ఎంవీ గంగా విలాస్‌ కీలకమైన ఓ ముందడుగుగా కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ అభివర్ణించారు. నదుల్లో నౌకా విహారం జరిగే దేశాల జాబితాలో భారత్‌కు చోటు లభిస్తుందన్నారు.

Last Updated : Jan 9, 2023, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details