Doctor Found Guilty of Sexual Offences: చికిత్స కోసం తన వద్దకు వచ్చిన మహిళలపై భారత సంతతి వైద్యుడొకరు లైంగిక దాడులకు పాల్పడినట్లు తాజాగా రుజువైంది. 72 ఏళ్ల డాక్టర్ కృష్ణ సింగ్ బ్రిటన్‌లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఆయన తనను లైంగికంగా వేధించారంటూ 2018లో ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభమైంది. 1983 ఫిబ్రవరి నుంచి 2018 మే వరకు మొత్తం 48 మంది మహిళలపై కృష్ణ సింగ్ లైంగిక నేరాలకు పాల్పడ్డారని గ్లాస్గోలోని హైకోర్టు గురువారం తేల్చింది. ఆయనకు వచ్చే నెలలో శిక్ష ఖరారు కానుంది.
48 మంది మహిళలపై లైంగిక దాడి.. చికిత్స కోసమని వెళ్తే! - బ్రిటన్ వార్తలు
UK Doctor Rape: బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన ఓ డాక్టర్ మహిళా పేషెంట్లపై లైంగిక నేరాలపై పాల్పడినట్లు వెల్లడైంది. ఆయనపై దాఖలైన 54 కేసుల్లో 48 నేరాలు రుజువయ్యాయి. 1983 నుంచి 2018 మధ్య లైంగిక దాడులకు పాల్పడినట్లు గ్లాస్గో హైకోర్టు తెలిపింది.
పేషెంట్లపై డాక్టర్ లైంగిక దాడులు
కృష్ణ సింగ్‌పై మొత్తం 50కిపైగా కేసులు నమోదుకాగా.. 48 కేసుల్లో దోషిగా తేలారు. మరో తొమ్మిది కేసులపై న్యాయస్థానం విచారణ చేపడుతోంది. నార్త్ లనార్క్షైర్ ప్రాంతంలో వైద్య సేవలు అందించే సమయంలో నిందితుడు ఈ నేరాలకు పాల్పడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు, ఓ పోలీస్ స్టేషన్ సహా పేషెంట్ల ఇళ్లకు వెళ్లి చికిత్స చేసిన సమయంలో ఈ దారుణాలకు తెగబడినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి :ఎటు చూసినా విధ్వంసమే.. ఎవర్ని కదిలించినా విషాదమే..