తెలంగాణ

telangana

ETV Bharat / international

India Canada Row : 'నిజ్జర్​ హత్య విషయంలో అమెరికా మాతోనే'.. కెనడా ప్రధాని కీలక వ్యాఖ్యలు - భారత్​పై ట్రూడో వ్యాఖ్యలు

India Canada Row : కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాది నిజ్జర్‌ హత్య విషయంలో అమెరికా తమతోనే ఉందని ప్రకటించారు.

india canada row
india canada row

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2023, 10:59 AM IST

Updated : Sep 29, 2023, 11:31 AM IST

India Canada Row : ఖలిస్థానీ వేర్పాటువాది, ఉగ్రవాది నిజ్జర్‌ హత్య విషయంలో అమెరికా తమతోనే ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో అన్నారు. అదే సమయంలో భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. మాంట్రియాల్లో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. "భారత్‌ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. అంతేకాదు.. కీలక భౌగోళిక రాజకీయ ప్రాధాన్యత ఉన్న దేశం. మేము గతేడాదే మా ఇండో- పసిఫిక్‌ వ్యూహంతో ముందుకొచ్చాం. భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై మేము చాలా సీరియస్‌గా పనిచేస్తున్నాం" అని చెప్పారు.

Justin Trudeau On India :మరోవైపు నిజ్జర్ హత్యపై పాతపాటే పాడారు కెనడా ప్రధాని ట్రూడో. కెనడా పౌరుడిని మా గడ్డపై హత్య చేయడంలో భారత ఏజెంట్ల పాత్ర నిర్ధరించే విషయంలో అమెరికన్లు తమతోనే ఉన్నారని చెప్పారు. భారత్‌ విదేశాంగ మంత్రితో భేటీ సమయంలో ఈ విషయాన్ని లేవనెత్తుతానని అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ వెల్లడించారన్నారు.

"కెనడా, దాని మిత్రదేశాలు భారత్‌తో కలిసి నిర్మాణాత్మకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ, అదే సమయంలో చట్టాలను అనుసరించే దేశంగా.. నిజ్జర్‌ హత్య విషయంలో మాతో కలిసి భారత్‌ పనిచేసి వాస్తవాలను వెలికితీయాలి. కెనడా పౌరుడిని మా గడ్డపై హత్య చేయడంలో భారత ఏజెంట్ల పాత్ర నిర్ధరించే విషయంలో అమెరికన్లు మాతోనే ఉన్నారు. నిజ్జర్‌ హత్యను ప్రజాస్వామ్యం, చట్టాలను అనుసరించే దేశాలు తీవ్రంగా పరిగణించాలి"

-- జస్టిన్ ట్రూడో, కెనడా ప్రధానమంత్రి

నిజ్జర్ హత్య దర్యాప్తు కొనసాగుతోంది : కెనడా పోలీసులు
మరోవైపు ఖలిస్థానీ వేర్పాటువాది, ఉగ్రవాది హర్​దీప్ సింగ్ నిజ్జర్​ హత్య కేసు దర్యాప్తు చురుగ్గా కొనసాగుతోందని కెనడా పోలీసుల తెలిపారు. నిజ్జర్ హత్యపై అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని.. తాము సేకరించిన సాక్ష్యాలపై ఇప్పుడు మాట్లబోమని చెప్పారు.

వైరల్ వీడియోపై ఇండో అమెరికన్లు ఫైర్​
కెనడాలోని హిందువులు వెళ్లిపోవాలంటూ వైరలైన వీడియోను ఖండించారు పలువురు ఇండో అమెరికన్లు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలింగంచవద్దని కోరారు. కెనడా గడ్డపై హిందూ దేవాలయాలు అపవిత్రం చేయడం సరైంది కాదని చెప్పారు. ఇరు దేశాల మధ్య వివాదాలను దౌత్య చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించారు అండర్​స్టాండింగ్ హిందూ ఫొబియా సహ వ్యవస్థాపకుడు విశ్వనాథన్​.

Canada Nazi Ukraine : క్షమాపణలు చెప్పిన కెనడా ప్రధాని ట్రూడో.. అది చాలా పెద్ద తప్పిదం అంటూ..

India Canada Row : కెనడా అంశంలో విచారణకు సహకరించాలన్న అమెరికా.. భారత్‌కు మద్దతుగా శ్రీలంక

Last Updated : Sep 29, 2023, 11:31 AM IST

ABOUT THE AUTHOR

...view details