How To Apply For Indian Student Visa: భారతదేశంలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని వీసా కోసం ఎదురుచూస్తున్న వీదేశీ విద్యార్థులకు భారత ప్రభుత్వం సులభమైన నియమ నిబంధనలను అందుబాటులోకి తెచ్చింది. దరఖాస్తుదారులు వీసా కోసం సమర్పించాల్సిన విధి విధానాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. మరి, ఇండియన్ వీసాకు ఎలా దరఖాస్తు చేయాలి ..? అర్హతలు ఏమిటి..? సమర్పించవలసిన పత్రాలు ఏమిటి..? చెల్లించాల్సిన రుసుము ఎంత..? అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇండియన్ వీసాకు దరఖాస్తు చేసే విధానం...
How to Apply for Indian Visa:
- విదేశీ విద్యార్థులు భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసించాలంటే ముందుగా how-to-apply-for-an-India-student-visa అనే వెబ్‌సైట్ సందర్శించాలి.
- వీసా కోసం అర్హత పొందాలంటే విద్యార్థి అధికారికంగా గుర్తింపు పొందిన విద్యాసంస్థలో చేరి ఉండాలి.
- విశ్వవిద్యాలయంలో చేరినట్టు ఏదైనా అంగీకార పత్రాన్ని లేదా వర్సిటీలో చెల్లించిన రుసుము పత్రాన్ని అప్‌లోడ్ చేయాలి.
- ఆన్‌లైన్‌లో వీసా దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిగా పూరించాలి.
- ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌కి పాస్‌పోర్ట్‌కు ఫోటోగ్రాఫ్‌ను జోడించాలి.
- ఆ తర్వాత భారతీయ అధికారులకు ఈ-చెల్లింపు చేయమని అడుగుతుంది. ఖర్చు దరఖాస్తుదారుడి జాతీయతపై ఆధారపడి ఉంటుంది.
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసిన తర్వాత వ్యక్తిగత వివరాలను మరోసారి నిర్ధారించుకోవాలి. లేనిపక్షంలో దరఖాస్తు తిరస్కరించబడుతుంది.
Prathidwani : విదేశీ విద్య.. వీసా చిక్కులు
ఇండియన్ వీసాకు అవసరమైన పత్రాలు..
Documents Required for Indian Visa:IVACలో అపాయింట్‌మెంట్‌కు హాజరయ్యే ముందు తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన పత్రాలను వీసా కేంద్రం వెల్లడించింది.
- పాస్‌పోర్ట్ కనీసం రెండు ఖాళీ పేజీలు ఉండాలి.
- 180 రోజుల కంటే ఎక్కువ గడువు తేదీ ఉండాలి.
- రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు ఉండాలి.
- పాస్‌పోర్ట్ ఫొటో కాపీ.
- భారతదేశంలో నివసిస్తున్న చిరునామా ధ్రువీకరణ పత్రం.
- ఆన్‌లైన్ అప్లికేషన్ ఒరిజినల్ కాపీ.
- విశ్వవిద్యాలయం నుండి పొందిన అధికారిక ప్రవేశ పత్రం.
- భారతదేశంలో జీవన వ్యయాలకు సంబంధించిన ఆర్థిక వనరుల రుజువు.
వీసా రావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది..?
How Many Days will it Take to Get The Visa?:విదేశీ విద్యార్థి భారతీయ విద్యార్థిగా వీసా పొందడానికి నిర్దిష్ట సమయం అంటూ ఏమీ లేదు. దరఖాస్తును సమర్పించిన రెండు వారాలలోపు అధికారులు నిర్ణయాన్ని వెల్లడిస్తారు. కానీ, దరఖాస్తులో ఏవైనా తప్పులు, సమస్యలు ఉంటే మాత్రం సకాలంలో వీసాను మంజూరు చేయరు.