Fish jumps into mouth: జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కొన్నిసార్లు అదృష్టం తలుపుతట్టి సర్ప్రైజ్లు ఇస్తుంటుంది. మరికొన్నిసార్లు దురదృష్టం భరించలేని బాధలను తెస్తుంది. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ వ్యక్తిగా సరిగ్గా ఇలాంటి పరిస్థితే వచ్చింది. సరదాగా చేపలవేటకు వెళ్లిన అతని గొంతులోకి ఓ చేప దూసుకెళ్లింది. బయటకు రాలేక నోట్లోనే ఇరుక్కుపోయి అతనికి ఊపిరాడకుండా చేసి ప్రాణాల మీదకు తెచ్చింది.
మే 22న పట్టాలంగ్ రాష్ట్రంలోని జరిగిన ఈ ఘటనకు సంబంధించి అమెరికా వార్తా సంస్థ కథనం ప్రచురించింది. సముద్రంలో స్పియర్ ఫిషింగ్‌కు వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని పరిస్థితి ఎదురైంది. అనాబస్ అని పిలిచే ఐదు అంగుళాల స్పైకీ ఫిష్ నీటిలో నుంచి ఎగిరి నేరుగా అతని గొంతులోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత ముక్కులో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించి అతని గొంతు, నాసికరంద్రాల మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో అతను ఊపిరాడక విలవిల్లాడాడు. వెంటనే చుట్టుపక్కల ఉన్నవారు గమనించి అతడ్ని ఆస్పత్రికి తరలించారు.