తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యాకు మరో తలనొప్పి.. 'నాటో' వైపు ఫిన్లాండ్ అడుగులు​.. అదే బాటలో స్వీడన్​!

Russia NATO News: రష్యాతో 1340 కిలోమీటర్ల మేర సరిహద్దు కలిగి ఉన్న ఫిన్లాండ్​.. నాటోలో చేరాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్లమెంట్‌లో వచ్చేవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. స్వీడన్‌ కూడా ఫిన్లాండ్​ బాటలోనే పయనించే అవకాశం ఉంది. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన రష్యా.. ఐరోపాలో భద్రత, స్థిరత్వానికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.

Russia Nato News
Russia Nato News

By

Published : May 13, 2022, 7:15 AM IST

Russia NATO News: నార్డిక్‌ దేశమైన ఫిన్లాండ్‌ నాటో కూటమిలో చేరేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఆ దేశ అధ్యక్షుడు సౌలి నిన్నిస్టో, ప్రధాని సన్నామారిన్‌లు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నాటోలో చేరేందుకు దరఖాస్తు చేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రానున్న మరికొన్నిరోజుల్లో నిర్ణయం వెలువడుతుందని వెల్లడించారు. నాటో సభ్యత్వంతో ఫిన్లాండ్‌ భద్రత మరింత బలపడుతుందని వెల్లడించారు. ఫిన్లాండ్‌ చేరికతో నాటో కూటమి కూడా బలోపేతం అవుతుందని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

ఫిన్లాండ్‌ పార్లమెంట్‌, సీనియర్‌ రాజకీయ నాయకులు పరిశీలించిన తర్వాత ఆదివారం నాటో అంశంపై ఓ ప్రకటన చేయనుంది. అదే రోజు స్వీడన్‌ కూడా నాటోలో చేరికపై ఓ నిర్ణయం వెలువరించనుంది. మరోపక్క రష్యా దీనిపై మండిపడుతోంది. ఎటువంటి సైనిక కూటముల్లో చేరకుండా తటస్థంగా ఉండటంపై కొన్ని దశాబ్దాలుగా ఉన్న పాలసీని వీడితే తీవ్ర పరిణమాలు తప్పవని స్వీడన్‌, ఫిన్లాండ్‌లను ఇప్పటికే రష్యా హెచ్చరించింది.

రష్యా విదేశాంగశాఖ ప్రతినిధి మారియా జఖరోవా ఇటీవల మాట్లాడుతూ.. "స్వీడన్‌, ఫిన్లాండ్‌లకు బాగా తెలుసు. దీని గురించి వారు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నాటోలో చేరితే ఏమవుతుందో వారికి పూసగుచ్చినట్లు చెప్పాం" అని తెలిపారు. నాటోలో చేరేందుకు మొగ్గు చూపిన ఉక్రెయిన్‌పై ఇప్పటికే దండయాత్ర చేస్తున్న రష్యా అనేక ప్రాంతాలను ఆక్రమించింది. ఫిన్లాండ్​, స్వీడన్‌ నాటోలో చేరితే రష్యా ప్రతిస్పందన ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత ఫిన్లాండ్‌లో నాటోలో చేరికపై ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ఫిన్లాండ్‌ 1,300 కిలోమీటర్ల సరిహద్దులను రష్యాతో పంచుకొంటోంది. ఇప్పటి వరకు రష్యాతో విరోధం వద్దనుకొని నాటోలో చేరలేదు. నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టాలెన్‌ బర్గ్‌ మాట్లాడుతూ వీలైనంత త్వరంగా స్వీడన్‌, ఫిన్లాండ్‌ సభ్యత్వం ప్రాసెసింగ్‌ పూర్తవుతుందన్నారు. ఇప్పటికే ఫిన్లాండ్‌లో నిర్వహించిన ఒక ప్రజాభిప్రాయ సేకరణలో దాదాపు 76శాతం మంది నాటోలో చేరేందుకు మొగ్గు చూపారు. రష్యా ఉక్రెయిన్‌పై దండెత్తిన తరువాత ఫిన్లాండ్‌ ప్రజల అభిప్రాయాల్లో మార్పు వచ్చింది.

ఇదీ చదవండి:శ్రీలంక ప్రధానిగా విక్రమసింఘె- ఆ పార్టీ నుంచి గెలిచిన ఒకేఒక్కడు!

ABOUT THE AUTHOR

...view details