తెలంగాణ

telangana

ETV Bharat / international

నాటోలో చేరిన ఫిన్​లాండ్​.. రష్యా బెదిరింపులు బేఖాతరు! - ఫిన్​లాండ్ నాటో

రష్యా బెదిరింపులను బేఖాతరు చేస్తూ మరింత దృఢంగా క్షేమంగా ఉండాలన్న తలంపుతో ఉన్న ఫిన్‌లాండ్.. నాటోలో చేరింది. ఉక్రెయిన్‌పై పుతిన్‌ దండయాత్ర తర్వాత రష్యా సరిహద్దు దేశమైన ఫిన్‌లాండ్‌ తమను నాటో సభ్య దేశంగా చేసుకోవాలని దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తుకు ఆమోదముద్ర వేసిన నాటో.. ఫిన్‌లాండ్‌ చేరికతో తమ బలం మరింత పెరిగిందని వెల్లడించింది. ఈ చేరికతో ఫిన్‌లాండ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద భద్రతా కూటమిలోకి ప్రవేశించింది. ఫిన్‌లాండ్‌ చేరికతో రష్యాతో సరిహద్దును నాటో కూటమి రెట్టింపు చేసుకుంది.

Finland joins NATO in major blow to Russia over Ukraine war
Finland joins NATO

By

Published : Apr 5, 2023, 8:42 AM IST

రష్యాతో 13,40 కిలోమీటర్ల సరిహద్దు పంచుకుంటున్న ఫిన్‌లాండ్.. నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌ (నాటో)లో సభ్య దేశంగా చేరింది. ఈ విషయాన్ని నాటో చీఫ్ జెన్స్‌ స్టోలెన్‌బెర్గ్‌ అధికారికంగా ప్రకటించి పత్రాలను అందజేశారు. ఈ కూటమిలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ చేరింది. 1994 నుంచి నాటో భాగస్వామ్య దేశంగా కొనసాగుతున్న ఫిన్‌లాండ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో సభ్య దేశంగా అవతరించింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తర్వాత నాటోలో చేరేందుకు ఫిన్‌లాండ్‌ దరఖాస్తు చేసుకుంది.

రష్యా నుంచి ముప్పు పెరుగుతుండడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిన్‌లాండ్ నేతలు ప్రకటించారు. అయితే ఫిన్‌లాండ్‌ చేరికను మొదటినుంచి వ్యతిరేకిస్తున్న తుర్కియే చివరకు ఆమోదం తెలపడం వల్ల ఆ దేశం నాటో సభ్య దేశంగా అవతరించింది. నాటోలో ఫిన్‌లాండ్ చేరిక రష్యాకు పెద్ద ఎదురుదెబ్బగా నిపుణులు భావిస్తున్నారు. నాటోలో ఫిన్‌లాండ్‌ చేరిక రష్యాకు భారీ వ్యూహాత్మక ఓటమిగా నిపుణులు భావిస్తున్నారు. గతంలో ఫిన్‌లాండ్‌కు నాటోలో చేరే ఉద్దేశమే లేకపోయినా ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు దిగడం వల్ల.. భద్రతా పరమైన సవాళ్లు పెరగడంతో ఫిన్‌లాండ్‌ నాటోలో చేరింది. ఈ చేరికతో రష్యాతో తన సరిహద్దును రెట్టింపు చేసుకుంది.

రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్‌ల చేతిలో ఓటమి తర్వాత ఫిన్‌లాండ్‌ ఏ దేశానికి మద్దతు తెలపకుండా తటస్థ విధానాన్ని అనుసరించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై దాడి చేసిన కొద్ది నెలలకే నాటోలో చేరాలని ఫిన్‌లాండ్‌ నిర్ణయం తీసుకుంది. ఫిన్‌లాండ్‌ను నాటో సభ్య దేశంగా ఆమోదిస్తే ఆ దేశానికి సరిహద్దుల్లో భారీగా బలగాలు, ఆయుధాలను మోహరిస్తామని రష్యా హెచ్చరించింది. ప్రతీకార చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికలను పట్టించుకోని నాటో ఫిన్‌లాండ్‌ను సభ్య దేశంగా ఆమోదించింది.

నాటో కూటమిలో చేరికతో ఫిన్‌లాండ్‌ భద్రతా రూపమే మారిపోనుంది. అధికారికంగా ఫిన్‌లాండ్‌ నాటోలో చేరడంతో ఆ దేశానికి ఇప్పుడు ఆర్టికల్‌ 5 వర్తించనుంది. దీని ప్రకారం నాటోలోని ఏ సభ్య దేశంపై దాడి జరిగినా అది అన్ని దేశాలపైనా జరిగిన దాడిగా భావించి చర్యలు తీసుకుంటారు. మరోవైపు భద్రత పరంగానూ నాటో నుంచి ఫిన్‌లాండ్‌కు భరోసా ఉంటుంది. అంటే ఒకవేళ రష్యా దాడిచేస్తే, ఆ దాడిని అడ్డుకునేందుకు మిత్ర దేశాలు వస్తాయన్న భరోసా ఇప్పుడు ఫిన్‌లాండ్‌కు ఉంటుంది.
ఫిన్లాండ్‌తో పాటు స్వీడన్‌ కూడా నాటోలో చేరేందుకు దరఖాస్తు చేసుకుంది. స్వీడన్‌ సభ్యత్వ ప్రక్రియ కూడా వచ్చే నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రష్యా బెదిరింపులను బేఖాతరు చేస్తూ మరింత దృఢంగా క్షేమంగా ఉండాలన్న తలంపుతో ఉన్న ఫిన్‌లాండ్ నాటోలో చేరింది.

ఉక్రెయిన్‌పై పుతిన్‌ దండయాత్ర తర్వాత రష్యా సరిహద్దు దేశమైన ఫిన్‌లాండ్‌ తమను నాటో సభ్య దేశంగా చేసుకోవాలని దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తుకు ఆమోదముద్ర వేసిన నాటో.. ఫిన్‌లాండ్‌ చేరికతో తమ బలం మరింత పెరిగిందని వెల్లడించింది. ఈ చేరికతో ఫిన్‌లాండ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద భద్రతా కూటమిలోకి ప్రవేశించింది. ఫిన్‌లాండ్‌ చేరికతో రష్యాతో సరిహద్దును నాటో కూటమి రెట్టింపు చేసుకుంది.

ABOUT THE AUTHOR

...view details