తెలంగాణ

telangana

ETV Bharat / international

తిరుగుబాటుదారులపై విరుచుకుపడ్డ మయన్మార్ సైన్యం.. 60 మంది మృతి

Myanmar air attack
మయన్మార్​ వైమానిక దాడులు

By

Published : Oct 24, 2022, 5:35 PM IST

Updated : Oct 24, 2022, 8:24 PM IST

17:31 October 24

తిరుగుబాటుదారులపై విరుచుకుపడ్డ మయన్మార్ సైన్యం.. 60 మంది మృతి

మయన్మార్​లో సైనిక పాలకులు అరాచకం సృష్టించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమావేశమైన వారిపై వైమానిక దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు 60 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఉత్తర రాష్ట్రమైన కచిన్‌లోని కచిన్ ఇండిపెండెన్స్ ఆర్గనైజేషన్ మద్దతుదారులు ఆదివారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సంస్థ ఏర్పాటు చేసిన వేడుకలపై మూడ్​ జెట్​లతో సైన్యం దాడులు చేసింది. ఈ వేడుకలకు హాజరైన సింగర్స్ కూడా మరణించారు. ఆంగ్​ సాన్​ సూకీ నుంచి సైన్యం అధికారాన్ని చేజిక్కించుకున్న తరవాత చేసిన దాడుల్లో ఇదే అతి పెద్ద దాడి.

కాచిన్ జాతి బలమైన తిరుగుబాటు సమూహాల్లో ఒకటి. స్వంతంగా ఆయుధాలు తయారు చేయగల సామర్థ్యం కలిగి ఉంది. కచిన్ ఇండిపెండెన్స్ ఆర్గనైజేషన్ 62వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతుండగా ఈ దాడులు జరిగాయి. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో సంగీత కచేరీ జరుగుతుండగా.. సైన్యం నాలుగు బాంబులను తమపైకి వేసిందని కచిన్ ప్రతినిధి మీడియాకు తెలిపారు. ఈ దాడుల్లో ఒక గాయకుడు, వ్యాపారవేత్తలు, సామాన్య పౌరులు మృతి చెందారని ఆయన తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించామన్నారు. ఆర్మీ సైనిక శిక్షణ కోసం ఉపయోగించే స్థావరమైన.. హపకాంత్ టౌన్‌షిప్‌లోని ఆంగ్ బార్లే గ్రామానికి సమీపంలో దాడులు జరిగాయి. ఇది మయన్మార్‌లోని అతిపెద్ద నగరమైన యాంగోన్‌కు ఉత్తరాన 950 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఓ మారుమూల పర్వత ప్రాంతం.

ఇవీ చదవండి:

Last Updated : Oct 24, 2022, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details