Ethiopia Air Strike :కల్లోలిత అమ్హారా ప్రాంతంలోని జనసమ్మర్ద కూడలిపై ఇథియోపియా జరిపిన వైమానిక దాడిలో26 మంది మృతిచెందారు. మరో 55 మందికి పైగా గాయపడ్డారు. దాడికి సంబంధించిన వివరాలను ఆ దేశానికి చెందిన సీనియర్ వైద్యాధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. ఓ ట్రక్కులో ప్రయాణిస్తున్న కొందరి వ్యక్తుల లక్ష్యంగానే ఈ దాడులు జరిగాయని చెప్పారు.
Air Strike Ethiopia : స్థానిక ఫానో ఉగ్రవాదులు.. తమను నిర్మూలించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఇథియోపియా సైన్యంతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఫానో ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న.. అమ్హారా ప్రాంతంలోని కీలక పట్టణాలను గతవారం సైనిక చర్య ద్వారా ఇథియోపియా సైన్యం స్వాధీనం చేసుకుంది. ఉగ్రవాదులకు ఆహారం అందించి ఓ ట్రక్కుపై వెనక్కు వస్తున్న వ్యక్తులపై వైమానిక దాడులు జరిగాయి. దీంతో ఘటనా స్థలంలోనే 22 మంది మరణించారు. మిగతా వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
రష్యాలో భారీ పేలుడు.. 27 మంది మృతి,
Russia Gas Station Explosion :రష్యాలోని ఓ గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడుజరిగింది. ఘటనలో 27 మంది చనిపోయారు. దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు కూాడా ఉన్నారు. డాగేస్తాన్ రాజధాని మఖచ్కల నగరంలో ఉన్న ఓ ఫిల్లింగ్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. రష్యా కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కాస్పియన్ సముద్రం ఒడ్డున ఉన్న ఈ నగరంలో.. మొదట హైవే పక్కనున్న కార్ల సర్వీసింగ్ మంటలు చెలరేగాయి.