shooting at church in nigeria: నైజీరియాలోని నైరుతి ప్రాంతం ఓండోలోని ఓ చర్చిపై ఆదివారం ఓ దుండగుడు దాడి చేశాడు. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న భక్తులపై కాల్పులకు తెగబడ్డాడు. బాంబులు విసరటం వల్ల పలువురు చిన్నారులు సహా 50 మంది వరకు మరణించి ఉంటారని స్థానిక శాసనసభ్యుడు ఒకరు చెప్పారు.
చర్చిలో కాల్పుల మోత.. పిల్లలు సహా 50 మంది మృతి! - nigeria latest news
shooting at church in nigeria: నైజీరియా ఓండోలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిపై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో మరణించి ఉంటారని స్థానిక శాసనసభ్యుడు చెప్పారు.
Shooting At Church
ఓండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చ్‌లో ఆదివారం ప్రార్థనలు చేస్తుండగా దుండగుడు ప్రవేశించి దాడి చేశాడు. ఈ ఘటనలో పలువురు పిల్లలు మరణించారని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నైజీరియా ఇస్లాం ఉగ్రవాదంతో బాధపడుతుండగా.. దేశంలో శాంతియుత రాష్ట్రంగా ఓండో ప్రసిద్ధి చెందింది.
ఇదీ చదవండి:మళ్లీ కాల్పుల మోత.. నలుగురు మృతి.. గ్రాడ్యుయేషన్ పార్టీల్లో గ్యాంగ్ వార్!
Last Updated : Jun 6, 2022, 5:47 AM IST