Cairo church fire accident : చర్చిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది గాయపడ్డారు. ఈజిప్ట్ రాజధాని కైరోలోని ఇంబాబా ప్రాంతంలో జరిగిందీ దుర్ఘటన.
ఆదివారం అబు సెఫీన్ చర్చిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఇలా జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చర్చిలో అగ్నిప్రమాదంపై ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్ సిస్సీ విచారం వ్యక్తం చేశారు. కోప్టిక్ క్రిస్టియన్ పోప్ తవాడ్రోస్-2కు ఫోన్ చేసి, సంతాపం తెలియచేశారు.
చర్చిలో భారీ అగ్నిప్రమాదం, 41 మంది మృతి - church fire today
చర్చిలో భారీ అగ్నిప్రమాదం
16:19 August 14
చర్చిలో భారీ అగ్నిప్రమాదం, 41 మంది మృతి
Last Updated : Aug 14, 2022, 4:42 PM IST