తెలంగాణ

telangana

ETV Bharat / international

Biden India Visit G20 Summit : భారత్​కు బైడెన్.. ప్రధాని మోదీతో ప్రత్యేక​ భేటీ.. కీలక అంశాలపై చర్చ! - india g20 joe biden

Biden India Visit G20 Summit : జీ-20 సమావేశాల కోసం భారత్​లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. సెప్టెంబర్​ 8న మోదీ ఇరు దేశాల సంబంధాలపై మాట్లాడనున్నట్లు శ్వేతసౌథం వెల్లడించింది.

Biden India Visit G20 Summit
Biden India Visit G20 Summit

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 9:50 AM IST

Updated : Sep 2, 2023, 10:04 AM IST

Biden India Visit G20 Summit :జీ20 సమావేశాల కోసం వచ్చే వారం భారత్​కు రానున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. రెండు దేశాల సంబంధాలపై సెప్టెంబర్​ 8న ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు వైట్​హౌస్​​ వెల్లడించింది. రష్యా, ఉక్రెయిన్​ యుద్ధంతో పాటు పేదరిక నిర్మూలన, ప్రపంచ బ్యాంక్​ లాంటి సంస్థల బలోపేతం లాంటి అనేక ప్రపంచ సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపింది.సెప్టెంబర్​ 7న దిల్లీకి చేరుకోనున్న బైడెన్.. 8న మోదీతో భేటీ కానున్నారు. అనంతరం 9, 10 తేదీల్లో జరిగే జీ20 సమావేశాల్లో పాల్గొననున్నారు. అనంతరం 10 తేదీన వియత్నాంకు బయలదేరనున్నారు.

ప్రధాని మోదీ తీరుపై బైడెన్ ప్రశంసలు
Joe Biden India G20 Meeting :జీ20కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్న తీరును అధ్యక్షుడు జో బైడెన్ ప్రశంసించారని శ్వేతసౌధం తన ప్రకటనలో చెప్పింది. ఆర్థిక సహకారానికి పాటుపడే జీ20 కూటమికి తాము కట్టుబడి ఉన్నామని బైడెన్ స్పష్టం చేశారని పేర్కొంది. 2026లో ఈ కూటమికి నాయకత్వం వహించడానికి అమెరికా ఎదురుచూస్తోందని వివరించింది.

9,10 తేదీల్లో జీ 20 మీటింగ్​.. 3 రోజులు సెలవులు ప్రకటించిన కేంద్రం
G 20 Summit in Delhi :జీ-20 ప్రపంచ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దేశ రాజధాని దిల్లీలో జరగనుంది. ఈ సమావేశానికి 29 దేశాల అధినేతలతో పాటు ఐరోపా సమాఖ్య, ఆహ్వానిత అతిథి దేశాలు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ఉన్నతాధికారులు హాజరయ్యే అవకాశం ఉంది. G-20 అధ్యక్ష బాధ్యతల్ని 2022 డిసెంబర్ 1న ఇండోనేసియా నుంచి భారత్ స్వీకరించింది. జీ-20 సమావేశం దృష్ట్యా దిల్లీలోని బ్యాంకులు, వాణిజ్య సంస్థలు, మార్కెట్​లు సహా అన్ని ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు 3 రోజులు మూసివేయనున్నారు.

XI Jinping G20 India : జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ గైర్హాజరుకానున్నట్లు సమాచారం. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఈ సమావేశాలకు రావడం లేదని ప్రకటించగా జిన్‌పింగ్‌ కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సదస్సుకు జిన్‌పింగ్‌ స్థానంలో చైనా ప్రధాన మంత్రి లీ చియాంగ్‌ హాజరుకానున్నట్లు సమాచారం.

మోదీ, బైడెన్ భేటీ.. అందుకు థ్యాంక్స్ చెప్పిన ప్రధాని.. రిషితో ముచ్చట్లు!

'తొలిసారి శ్వేతసౌధం ద్వారాలు తెరచుకున్నాయి'.. బైడెన్​కు థ్యాంక్స్ చెప్పిన మోదీ

Last Updated : Sep 2, 2023, 10:04 AM IST

ABOUT THE AUTHOR

...view details