తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రేమించిన వ్యక్తి కోసం.. రూ.2వేల కోట్ల ఆస్తి వదులుకున్న బిజినెస్ టైకూన్​ కూతురు - ఏంజెలినా ఫ్రాన్సిస్ మలేసియా వ్యాపారవేత్త కూతురు

Angelina Francis Malaysia Love Story : ధనిక కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ యువతి.. ఓ సామాన్య వ్యక్తిని ప్రేమించింది. వీరి పెళ్లికి యువతి తల్లిదండ్రులు నిరాకరించినా.. చివరికి అతడినే పెళ్లాడింది. వారసత్వంగా వచ్చిన రూ.2వేల కోట్ల ఆస్తిని కూడా కాదనుకుని జీవితం సాగిస్తోంది.

Angelina Francis Malaysia Love Story
Angelina Francis Malaysia Love Story

By

Published : Aug 14, 2023, 10:23 PM IST

Updated : Aug 14, 2023, 10:29 PM IST

Angelina Francis Malaysia Love Story : సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ యువతి.. ఒక సామాన్య వ్యక్తిని ప్రేమించింది. అతడే తనకు అన్నింటికన్నా ముఖ్యం అనుకుంది. ఆమె తల్లిదండ్రులు నిరాకరించినా.. తాను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని సిద్ధమైంది. అంతేకాదు, వారసత్వంగా వచ్చిన రూ.వేల కోట్ల ఆస్తిని కూడా కాదనుకుంది. ఆ అమ్మాయే మలేసియా బిజినెస్​ టైకూన్​ కుమార్తె. ప్రియుడి కోసం అన్నీ వదులుకొని ఇంటినుంచి బయటకు వెళ్లి నచ్చిన జీవితం కొనసాగిస్తోంది.

మలేసియాకు చెందిన ఏంజెలినా ఫ్రాన్సిస్‌ అనే యువతి.. ప్రముఖ వ్యాపారవేత్త ఖూ కే పెంగ్‌, మాజీ మిస్‌ మలేసియా పాలైన్‌ ఛాయ్‌ దంపతుల కుమార్తె. ఈమె యూకేలోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుకుంది. ఆ సమయంలో జెడియా అనే వ్యక్తితో ఏంజెలినాకు స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త క్రమంగా ప్రేమగా మారింది. అనంతరం వీరిద్దరు వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఏంజెలినా ఫ్రాన్సిస్​ ఇదే విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపింది. కానీ, వారు మాత్రం ఈ పెళ్లికి నిరాకరించారు. ఆర్థికపరంగా జెడియా కుటుంబం తమ కుటుంబం మధ్య భారీ తేడా ఉందని ఏంజెలినాకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అతడిని దూరం కావడమో లేదా వారసత్వాన్ని వదులుకోవడమో చేయాలని ఆదేశించారు.

అష్టైశ్వర్యాల కన్నా.. ప్రేమించిన వ్యక్తే ముఖ్యమనుకుంది ఏంజెలినా. చివరకు ప్రియుడితోనే స్థిరపడాలని నిశ్చయించుకుంది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. 2008లో తన ప్రేమికుడు జెడియాను వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో వారసత్వంగా వచ్చే దాదాపు రూ. 2వేల కోట్ల ఆస్తిని కూడా వదులుకుంది.

అయితే ఈ జంట.. వివాహం అనంతరం వీరిద్దరు కూడా వారి రెండు కుటుంబాలకు దూరంగానే ఉన్నారు. చాలారోజులు దూరంగా ఉన్న ఏంజెలినా ఫ్రాన్సిస్‌.. ఓసారి వారి తల్లిదండ్రులను కలవాల్సి వచ్చింది. ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడమే అందుకు కారణం. న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చేందుకు ఏంజెలినా కోర్టుకు వెళ్లింది. ఈ క్రమంలో తన తల్లి గురించి గొప్పగా వివరించింది. తన కుటుంబం కోసం ఆమె చేసిన సేవలను కొనియాడింది. కానీ తండ్రిపై మాత్రం విమర్శలు గుప్పించింది. ఏదేమైనా తల్లిదండ్రులు ఇద్దరూ తిరిగి కలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని చెప్పంది. అయితే, ఆమె ప్రేమ కథ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇన్​స్టాలో పరిచయం.. ప్రియుడి కోసం భారత్ వచ్చిన పోలాండ్ మహిళ.. ఆరేళ్ల కూతురితో..

ఫేస్‌బుక్‌ లవ్​.. ప్రియుడి కోసం పాక్‌కు వెళ్లిన భారత మహిళ

Last Updated : Aug 14, 2023, 10:29 PM IST

ABOUT THE AUTHOR

...view details