కరోనా కారణంగా సన్నిహితులు లేకుండా ఈ సారి పండుగలను ఒంటరిగా జరుపుకోవాల్సి వచ్చిందని బాధపడిన వారు ఒంటరి వాళ్లు కారని బ్రిటన్ రాణి ఎలిజబెత్ అన్నారు. ఈ మేరకు క్రిస్మస్ వీడియో సందేశాన్ని పంపించారు.
స్ఫూర్తి నింపిన దీపావళి
విండోర్స్ లో జరిగిన దీపావళి పండుగను క్వీన్ ఉదహరించారు. భౌతిక దూరంతో ఉన్నా మనందరిలో ఐక్యమత్యాన్ని , ఆశలను దీపావళి ప్రతిబింబించిందని గుర్తుచేశారు. క్రిస్మస్ కాంతులు అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని కోరారు.
ఈ సంవత్సరం కరోనా భౌతికంగా ఎవరిని కలవకుండా దూరంగా ఉంచినా.. మానసికంగా దగ్గరయ్యేలా చేసిందని పేర్కొన్నారు. 2020 విసిరిన సవాళ్లను బ్రిటనే కాకుండా ప్రపంచ దేశాల ప్రజలు ధీటుగా ఎదర్కొన్నారని వ్యాఖ్యానించారు.
కరోనా పోరులో ముందుండి నడిచినవారు నిస్వార్థ సేవకులని కొనియాడారు. ఎలిజబెత్ దంపతులు తమ నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడకలలో పాల్గొనలేదు. బ్రిటన్ రాజదంపతులు క్రిస్మస్ వేడుకలలో పాల్లొనకపోవడం 1980 తరువాత ఇదే మొదటిసారి.
ఇదీ చూడండి :ఎలిజబెత్ మహారాణి ముద్దు పేరేంటో తెలుసా?