జాన్సన్ అండ్ జాన్సస్ రూపొందించిన సింగిల్ డోసు కొవిడ్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం తెలిపింది. ఈ వ్యాక్సిన్ను అత్యవసర వినియోగం కింద అనుమతిస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది. కొత్త వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తుండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా టీకా పంపిణీ విస్తృతం చేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఐరోపాలోని 27 దేశాల్లో ఈ టీకాను అనుమతించాలని 'యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ' ప్రతిపాదించిన మరుసటి రోజే డబ్ల్యూహెచ్ఓ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
టీకా సమర్థత..
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్.. కరోనావైరస్పై 85 శాతం ప్రభావితం చూపుతుందని ఇటీవల ఓ సర్వే వెల్లడించింది. ఇది దక్షిణాఫ్రికా సహా పలు ప్రమాదకర వేరియంట్లను కూడా ఎదుర్కోగలదని పేర్కొంది.