ఐరోపాలోనే అతిపెద్ద నది వోల్గా. శీతాకాలం నీరు గడ్డకట్టి స్తబ్దుగా ఉండే ఈ నది వసంతకాలం వచ్చిందంటే నౌకాయానాలతో కళకళలాడుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యటకులను ఆకర్షిస్తోంది.
పర్యటకులకే కాకుండా ఆ మార్గంలో ప్రయాణించే వాణిజ్య నౌకలు, ప్రయాణికుల పడవల్లో పని చేసే సిబ్బందికీ ఈ'వసంతం' ఎంతో ముఖ్యం. ఎందుకంటే చాలా మందికి అదే జీవనాధారం.
ఈ ఏడాది వసంతకాల మొదటి ప్రయాణానికి నీష్నీ 'నోవ్గరడ్ రివర్ స్టేషన్' సిద్ధమైంది. ఇక్కడి నుంచే మొదటి ప్రయాణికుల ఓడ మాస్కో నగరానికి బయల్దేరుతుంది. నాలుగు రోజుల పాటు ప్రయాణించి మాస్కో చేరుకోనుంది ఈ ఓడ.
ఏటా ఎన్నో కొత్త కొత్త సవాళ్లు ఎదురవుతుంటాయని.. అయినా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగుతుంటామని ఇక్కడ పని చేసే సిబ్బంది అంటున్నారు.