తెలంగాణ

telangana

ETV Bharat / international

కశ్మీర్​లో ఆంక్షలు సడలించండి: ఐరాస ​హెచ్​ఆర్​సీ - పాకిస్థాన్

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు నేపథ్యంలో విధించిన ఆంక్షలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగం అధిపతి మిచెల్​ బచెలెట్​. ప్రజలు కనీస సౌకర్యాలు పొందేలా ప్రస్తుత ఆంక్షలు సడలించాలని భారత్​కు సూచించారు.

కశ్మీర్​లో ఆంక్షలు సడలించండి: ఐరాస ​హెచ్​ఆర్​సీ

By

Published : Sep 10, 2019, 8:00 AM IST

Updated : Sep 30, 2019, 2:16 AM IST

భారత్​, పాకిస్థాన్​ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాలు కశ్మీర్​ ప్రజల హక్కులను గౌరవించాలని, రక్షించాలని కోరారు ఐరాస మానవ హక్కుల చీఫ్​ మిచెల్​ బచెలెట్​. కశ్మీర్​లోని నియంత్రణ రేఖకు ఇరువైపులా మానవ హక్కుల పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదిక తీసుకుంటున్నట్లు తెలిపారు.

కశ్మీర్​పై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అక్కడి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని, నిర్ణయాల్లో భాగస్వాములను చేయాలని కోరారు బచెలెట్​. అలాగే అసోం జాతీయ పౌర రిజిస్టర్​లో పేరు లేని వారిని ఎలాంటి అధారం లేకుండా వదిలివేయకూడదన్నారు.

పాక్​ కొత్త వాదన...

ఐరాసఆందోళన వ్యక్తం చేసిన తీరు.. కశ్మీర్​పై అంతర్జాతీయ సంస్థ వైఖరి తెలియజేస్తుందని పాకిస్థాన్ కొత్తవాదం తెరపైకి తెచ్చింది​. జమ్ముకశ్మీర్​లో​ పరిస్థితులు దిగజారుతున్నాయని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మరోసారి విషం చిమ్మారు.

మానవ హక్కుల మండలి సమావేశానికి జెనివా వెళ్లనున్నారు పాక్​ విదేశాంగ మంత్రి మహమూద్​ ఖురేషీ. ఆ సమావేశాల్లో భాగంగా వివిధ దేశాధినేతలతో భేటీ అయి కశ్మీర్​ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది.

పాక్​పై కాంగ్రెస్ విమర్శలు...​

జైషే మహ్మద్​ ఉగ్రసంస్థ అధినేత మసూద్​ అజర్​ను విడుదల చేసినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో పాకిస్థాన్​పై తీవ్ర ఆరోపణలు చేసింది కాంగ్రెస్​. భారత బలగాలపై దాడులు చేస్తామని పేర్కొంటున్న ఉగ్రవాదిని విడుదల చేసి ఐరాసలో కశ్మీర్​ అంశంపై పాక్​ ఏ విధంగా మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.

కశ్మీర్​పై పాక్​కు చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు కాంగ్రెస్​ సీనియర్​ నేత శశి థరూర్​. గిల్గిత్​-బాల్టిస్థాన్​, పీఓకేపై తన వైఖరిని మార్చుకున్న పాకిస్థాన్​ భారత్​ వైపు ఏవిధంగా వేలెత్తి చూపుతుందని ప్రశ్నించారు. భారత అంతర్గత విషయాల్లో పాక్​ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని విమర్శించినప్పటికీ.. అంతర్జాతీయంగా తామంతా ఒక్కటేనని స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పాకిస్థాన్​కు మద్దతు ఇచ్చేది లేదని తెలిపారు.

ఇదీ చూడండి: బ్రిటన్​ పార్లమెంటు నెలరోజుల పాటు రద్దు

Last Updated : Sep 30, 2019, 2:16 AM IST

ABOUT THE AUTHOR

...view details