Ukraine Russia war: చర్చల ద్వారా యుద్ధానికి తెరపడుతుందని ఉక్రెయిన్ ఒకపక్క ఆశాభావంతో ఉంటే మరోపక్క రష్యా గురువారం యథావిధిగా ముప్పేట దాడులు కొనసాగించింది. బుధవారం రాత్రి మేరియుపొల్‌లో గగనతల దాడిలో దెబ్బతిన్న మూడంతస్తుల డ్రామా థియేటర్ శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. దిగువ అంతస్తులో తలదాచుకున్న అనేకమందిలో కొంతమంది సురక్షితంగా బయటపడగా మిగిలిన వారిని రక్షించే చర్యలపై అధికార వర్గాలు చర్యలు చేపట్టాయి. ఇదే నగరంలో ఈతకొలను సముదాయంలో మహిళలు, పిల్లలు సహా పలువురు తలదాచుకోగా దానిపైనా రష్యా దాడి చేసింది. థియేటర్‌పై గానీ, ఈ నగరంలోని వేరేచోట గానీ తాము బాంబుదాడి చేయనేలేదని రష్యా ఖండించింది.
బాంబుల వర్షం
యుద్ధం మొదలయ్యాక రష్యా గుప్పిట్లోకి వెళ్లిన ఖేర్సన్ విమానాశ్రయాన్ని ఉక్రెయిన్ సైనికులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. కీవ్ శివార్లలోని మరిన్ని ప్రాంతాల్లోనూ జనావాసాలపై రష్యా సైనికులు బాంబుల వర్షం కురిపించారు. రష్యా రాకెట్‌ను ఉక్రెయిన్ కూల్చివేయగా దాని శకలాలు పడి 16 అంతస్తుల భవంతికి నిప్పంటుకుంది. ఖర్కివ్‌కు సమీపంలోని మెరెఫాలో పాఠశాల భవనాన్ని, సామాజిక కేంద్రాన్ని కూడా రష్యా సేనలు ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో 21 మంది మృతి చెందారు. మరో వసతి గృహంపై జరిగిన దాడిలో మూడేళ్ల కవలలు, వారి తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో 22 రోజుల పసికందు ఉండడం వైద్యుల్ని కదిలించింది. "ఉక్రెయిన్‌లో సున్నితమైన పరిస్థితుల్లో ఉన్న పౌరుల రక్షణ"కు ఐరాస భద్రత మండలిలో రష్యా ప్రవేశపెట్టిన తీర్మానంపై శుక్రవారం ఓటింగు జరిగే అవకాశం ఉంది. నాటో సభ్య దేశమైన పోలండ్‌కు 'క్షిపణి నిరోధక వ్యవస్థ'ను పంపించాలని బ్రిటన్ నిర్ణయించింది.
జెలెన్‌స్కీ ఉన్నచోటకు చేరువగా దాడి
జర్మనీ చట్టసభ సభ్యులనుద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. యుద్ధంలో 108 మంది చిన్నారులు సహా వేలమంది ఉక్రెయిన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనీ చెప్పారు. జెలెన్‌స్కీ ప్రసంగిస్తున్న ప్రాంతానికి సమీపంలోనే రష్యా దాడులు జరగడంతో ఈ కార్యక్రమం కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. జర్మనీకి తమకంటే సహజవాయువు పైపులైనే ముఖ్యమైపోయిందని నిష్ఠూరమాడారు. నాటో, ఈయూ దేశాలు తమకు మద్దతివ్వాలని కోరారు.
కఠిన ఆంక్షలపై పుతిన్ పరోక్ష సంకేతాలు