తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫేస్‌బుక్‌కు రూ.515 కోట్లు జరిమానా!

ఫేస్​బుక్​కు బ్రిటన్‌ కాంపీటీషన్‌ రెగ్యులేటర్‌ షాకిచ్చింది. అడిగిన వివరాలు సమర్పించే విషయంలో ఫేస్‌బుక్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రూ.515 కోట్లు జరిమానాగా విధించింది.

UK watchdog fines Facebook $70 mn over enforcement order breach
ఫేస్‌బుక్‌కు రూ.515 కోట్ల జరిమానా!

By

Published : Oct 20, 2021, 8:52 PM IST

Updated : Oct 20, 2021, 9:13 PM IST

ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌కు బ్రిటన్‌ కాంపీటీషన్‌ రెగ్యులేటర్‌ భారీ జరిమానా విధించింది. తాము అడిగిన వివరాలు సమర్పించడంలో ఫేస్‌బుక్‌ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిందని, అందుకే రూ.515 కోట్లు (50.5 మిలియన్‌ పౌండ్లు) జరిమానాగా చెల్లించాలని ఆదేశించినట్లు తెలిపింది. ఏ కంపెనీ అయినా చట్టానికి లోబడి ఉండాల్సిందేనన్న హెచ్చరిక పంపించాలన్న విధానాల మేరకు ఈ జరిమానా విధించినట్లు పేర్కొంది.

యూనిమేటెడ్‌ సంస్థ జిఫీని గతేడాది ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది. అయితే, జిఫీ కొనుగోలు ద్వారా సామాజిక మాధ్యమాల మధ్య పోటీని ఫేస్‌బుక్‌ నియంత్రిస్తోందన్న ఆరోపణలపై బ్రిటన్‌ కాంపీటీషన్‌ అండ్‌ మార్కెట్స్‌ అథారిటీ (సీఎంఏ) విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో వివరాలు ఇవ్వాలని పలుమార్లు కోరినప్పటికీ వాటిని సమర్పించడంలో ఫేస్‌బుక్‌ ఉద్దేశపూర్వకంగానే వెనుకడుగు వేసిందని సీఎంఏ పేర్కొంది. మరోవైపు సీఎంఏ నిర్ణయంపై ఫేస్‌బుక్‌ స్పందించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది. సీఎంఏ నిర్ణయంపై సమీక్షించి తదుపరి అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది.

ఇదీ చదవండి:కరోనా మరణాల రికార్డ్​- వారం పాటు కార్యాలయాలు బంద్​!

Last Updated : Oct 20, 2021, 9:13 PM IST

ABOUT THE AUTHOR

...view details