తెలంగాణ

telangana

ETV Bharat / international

'సెప్టెంబర్ నాటికి 30 మిలియన్ వ్యాక్సిన్ డోస్​లు' - covid-19 news

కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీ, వాణిజ్యం కోసం ప్రభుత్వ సహకారంతో ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థతో గ్లోబల్ లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్రిటన్ వెల్లడించింది. కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి క్లినికల్ ట్రయల్స్​లో పురోగతి సాధించినట్లు తెలిపింది. టీకా విజయవంతమైతే సెప్టెంబర్ నాటికి బ్రిటన్​కు 30 మిలియన్ల డోస్​లు అందుతాయని వెల్లడించింది.

UK to get 30 million vaccine doses if trials work
'సెప్టెంబర్ నాటికి 30 మిలియన్ వ్యాక్సిన్ డోస్​లు'

By

Published : May 18, 2020, 2:08 PM IST

కరోనా మహమ్మారి వ్యాక్సిన్ తయారీలో పురోగతి సాధించినట్లు తెలపింది బ్రిటన్. ఒకవేల టీకా విజయవంతమైతే వచ్చే సెప్టెంబర్ నాటికి సుమారు 30 మిలియన్ల డోస్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. కొవిడ్-19 వ్యాక్సిన్ 100 మిలియన్ డోస్​ల తయారీకి ఓ ఔషధ సంస్థతో ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్రిటన్ వాణిజ్య కార్యదర్శి అలోక్ శర్మ ప్రకటించారు.

కరోనా వైరస్ రోజువారీ ప్రకటనలో భాగంగా ఈ మేరకు వివరాలు వెల్లడించారు అలోక్​ శర్మ

" ప్రభుత్వ సాయంతో ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సిన్ తయారీ, వాణిజ్యం కోసం ఆస్ట్రాజెనెకా సంస్థతో గ్లోబల్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. వ్యాక్సిన్ విజయవంతమైతే టీకా పొందిన తొలి దేశంగా యూకే నిలుస్తుంది. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ధరకే వ్యాక్సిన్​ను అందుబాటులో ఉంచుతాం."

– అలోక్ శర్మ, బ్రిటన్ వాణిజ్య కార్యదర్శి

డ్రగ్ తయారీకి వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలతో కలిసి ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ఇప్పటికే 6 రకాల ఔషధాలు క్లినికల్ ట్రయల్స్​లో ఉన్నాయని, సత్ఫలితాలు వస్తే.. మరింత ముందుకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details