తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెగ్జిట్ గడువు మరోమారు పొడిగింపు!

బ్రెగ్జిట్​పై పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభనను తొలిగించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు బ్రిటన్​ ప్రధాని థెరిసా మే. బ్రెగ్జిట్​ అమలుకు మరింత గడువు పొడిగించాలని ఈయూను కోరతామని వెల్లడించారు.

సమావేశం అనంతరం మాట్లాడుతున్న బ్రిటన్​ ప్రధాని థెరిసా మే

By

Published : Apr 3, 2019, 7:03 AM IST

Updated : Apr 3, 2019, 7:32 AM IST

బ్రెగ్జిట్​ బిల్లుపై పార్లమెంటులో ప్రతిష్టంభనను తొలిగించేందుకు బ్రిటన్​ ప్రధాని థెరిసా మే ప్రణాళికలు
బ్రెగ్జిట్​ అమలుకు మరింత గడువు పొడిగించాలని యూరోపియన్​ యూనియన్​ను కోరనున్నట్టు బ్రిటన్​ ప్రధాని థెరిసా మే వెల్లడించారు. ఒప్పందానికి పార్లమెంటులో చట్టసభ్యుల ఆమోదం కోసం ఆమె ప్రయత్నిస్తున్నారు.

బ్రెగ్జిట్​పై పార్లమెంటులో ప్రతిష్టంభన గురించి మంత్రులతో ఏడు గంటల పాటు చర్చించారు థెరీసా మే. అనంతరం ఈయూని మరింత సమయం కోరతామని ప్రకటించారు. అలాగే ప్రతిపక్ష లేబర్​ పార్టీ అధినేత జెరెమి కోర్బిన్​ను చర్చలకు ఆహ్వానించారు. పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఉమ్మడి విధానం కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు.

" ఒప్పందంతో ఈయూ నుంచి విడిపోవడమే మంచి పరిష్కారం. పార్లమెంటులో బ్రెగ్జిట్​​ ఒప్పందం ఆమోదం పొందేంత వరకు ఆర్టికల్​ 50కి గడువు పొడిగింపు అవసరం. " -- థెరిసా మే, బ్రిటన్​ ప్రధాని

మార్చి 29తో ముగియనున్న బ్రెగ్జిట్​ గడువును ఏప్రిల్​ 12 వరకు పొడిగించేందుకు ఇప్పటికే ఈయూ నేతలు అంగీకరించారు. 12న ఒప్పందం లేకుండా ఈయూ నుంచి బ్రిటన్​ విడిపోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరింత సమయం కోరనున్నట్టు ప్రకటించారు మే.
ఇప్పటికే బ్రెగ్జిట్​ బిల్లు పార్లమెంటులో మూడుసార్లు తిరస్కారానికి గురైంది.

Last Updated : Apr 3, 2019, 7:32 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details