వివిధ రకాల స్ట్రెయిన్లు పుట్టుకొస్తూ ప్రపంచంలో అనేక చోట్ల కరోనా కలవరపెడుతున్న వేళ బ్రిటన్లో మరో ప్రమాదకర వైరస్ బయటపడింది. మంకీపాక్స్(Monkeypox)గా పిలిచే ఈ వ్యాధి వ్యాప్తిపై స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్ కేసులను అధికారులు గుర్తించగా తాజాగా మరో రెండు ఆ జాబితాలో చేరాయి.
ఉత్తర ఐర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్లో ఈ మంకీపాక్స్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. వైరస్ సోకిన వారికి ప్రస్తుతం ఇంగ్లాండ్లో చికిత్స అందిస్తున్నారు.
మంకీపాక్స్ అంటే?
మంకీపాక్స్ అనేది జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువ. ఇది కరోనా తరహాలోనే ఒకరి నుంచి శ్వాసకోస బిందువుల ద్వారా సోకుంది. వ్యాధి సోకిన వారిని తాకినా.. మంకీపాక్స్ వ్యాపించే అవకాశం ఉంది. ఇది శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం కూడా పడుతుందని నిపుణులు వెల్లడించారు.
దీని లక్షణాలు ఏంటి?(Monkeypox symptoms)