ఎంతోమందికి సేవలందించిన ఆ నర్సు కరోనా ధాటికి మృత్యువాత పడింది. నిండు గర్భిణిగా ఉన్న ఆమె ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చి ఆదివారం మృతి చెందింది. కాగా ఆ బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఆ పసిపాపకు కరోనా సోకిందా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు.
లండన్‌కు ఉత్తరాన ఉన్న లూటన్ అండ్ డన్‌స్టేబుల్ యూనివర్శిటీ హాస్పిటల్‌లోని జనరల్ వార్డులో మేరీ అగైవా అగ్యాపాంగ్ (28) నర్సుగా పనిచేసేది.
" బెడ్‌ఫోర్డ్‌షైర్ ఆస్పత్రిలో ఈనెల 5న పరీక్ష నిర్వహించగా అగ్యాపాంగ్కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమె 7వ తేదీన ఆస్పత్రిలో చేరింది. ఆదివారం మేరీ మరణించింది. మేరీ ఐదేళ్లగా ఇక్కడే పనిచేస్తుంది. చాలా మంచి వ్యక్తి. మేరీ కుటుంబం, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం."
-- డేవిడ్ కార్టర్, ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్