బ్రెగ్జిట్ అనంతరం బ్రిటన్-ఈయూల మధ్య జరుగుతున్న చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. చర్చలు విఫలమయ్యే అవకాశం ఎక్కువగా హెచ్చరించారు. ఈయూతో వాణిజ్య ఒప్పందం ఏర్పడేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. చర్చలపై అంతిమ ఫలితాన్ని స్వాగతించేందుకు వ్యాపారవేత్తలు, ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు.
"చర్చలకు మేము ఈయూకు చాలా సహకారం అందించాం. అన్ని అంశాల్లో పురోగతి సాధించేందుకు తీవ్రంగా శ్రమించాం. ఈయూతో గడువు ముగిసే వరకు చర్చలను కొనసాగిస్తాము. ఆస్ట్రేలియా లాగే.. బ్రిటన్ సైతం ఈయూతో.. ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలకు లోబడి వాణిజ్యం చేసేందుకే బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి."
--బోరిస్జాన్సన్, బ్రిటన్ ప్రధాన.