తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రెగ్జిట్​ను తేల్చేందుకు రోజూవారి చర్చలు!

బ్రెగ్జిట్​పై చర్చలు మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​, ఐరోపా సమాఖ్య అధినేత జీన్​క్లౌడ్​ అభిప్రాయపడ్డారు. ఒప్పందానికి సంబంధించి వీరిద్దరి మధ్య జరిగిన భేటీలో రోజూవారి చర్చలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

బ్రెగ్జిట్​ అంశాన్ని తీవ్రతరం చేయాలి : బోరిస్​ జాన్సన్​

By

Published : Sep 17, 2019, 8:12 AM IST

Updated : Sep 30, 2019, 10:12 PM IST

బ్రెగ్జిట్​ ఒప్పందం అంశాన్ని త్వరగా తేల్చేందుకు రోజూవారి చర్చలు నిర్వహించాలని బ్రిటన్​, ఐరోపా సమాఖ్య నిర్ణయించాయి. ఐరోపా సమాఖ్య అధినేత జీన్​-క్లౌడ్​ జంకర్​తో లక్సెంబర్గ్​లో జరిగిన భేటీ ఇదే విషయమై చర్చించారు బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​. రోజువారి చర్చలతోనే బ్రెగ్జిట్​ కొలిక్కి రావాల్సిన అవసరం ఉందని ఇరువురు భావించినట్లు బ్రిటన్​ ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఈయూ నుంచి అక్టోబరు 31నాటికి బ్రిటన్​ బయటకు రావాలని జాన్సన్​ ఆకాంక్షించినట్లు తెలిపింది.

అక్టోబరు 19 లోగా ఉపసంహరణ ఒప్పందం, ఎంపీల ఆమోదం పొందలేకపోతే జాన్సన్ బ్రెగ్జిట్​​ పొడిగింపు గడువు కోరాలని బ్రిటన్​ పార్లమెంటు చట్టాన్ని జారీ చేసింది. అయితే ఈ నెల 17,18 న జరిగే ఐరోపా సమాఖ్య శిఖరాగ్ర సమావేశానికి బ్రిటన్​ దూరంగా ఉండాలని జాన్సన్​ భావిస్తున్నారు.

Last Updated : Sep 30, 2019, 10:12 PM IST

ABOUT THE AUTHOR

...view details