తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిటన్​పై కరోనా పంజా.. ఒక్కరోజే 60వేల కేసులు - రికార్డ్​ స్థాయిలో కరోనా కేసులు

బ్రిటన్​లో కరోనా మహమ్మారి ఉగ్ర రూపం దాల్చుతోంది. గత వారం రోజులుగా రోజుకు 50 వేలకుపైగా కేసులు నమోదవుతుండగా మంగళవారం రికార్డు స్థాయిలో 60 వేల కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజే 830 మంది మరణించారు.

UK daily coronavirus cases
బ్రిటన్​పై కరోనా పంజా

By

Published : Jan 6, 2021, 5:39 AM IST

కరోనా మహమ్మారితో బ్రిటన్​ విలవిల్లాడుతోంది. కొత్త కేసుల నమోదులో అగ్రరాజ్యం అమెరికాతో పోటీపడుతోంది. వైరస్​ ప్రారంభమైన తర్వాత తొలిసారి రోజువారీ కేసుల నమోదులో గరిష్ఠ స్థాయిని చేరుకుంది. మంగళవారం ఒక్కరోజే ఏకంగా 60వేలకుపైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. 830 మంది మరణించారు.

ఇటీవల బయటపడిన కొత్త రకం కరోనా స్ట్రెయిన్​తో రోజు వారీ కేసుల రేటు గణనీయంగా పెరుగుతోందని అధికారులు తెలిపారు. కొత్త రకం కేసులతో కలిపి మంగళవారం మొత్తం 60,916 కేసులు బయటపడినట్లు వెల్లడించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,720,000కు చేరింది. అలాగే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 76,305 మంది మరణించారు.

లాక్​డౌన్​..

కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఇంగ్లాండ్​, స్కాట్లాండ్​లలో లాక్​డౌన్​ విధించారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రజలు అత్యవసరాలకు మినహా బయటకి రావొద్దని గత సోమవారం కోరారు ప్రధాని బోరిస్​ జాన్సన్​. కేసులు పెరుగుతున్న క్రమంలో వ్యాక్సిన్​ పంపిణీపై రోజువారీ డేటా విడుదల చేస్తామని తెలిపారు ప్రధాని. కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన వారిని రక్షించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

గత ఏడాది డిసెంబర్​ 29 నుంచి రోజుకు 50 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.

ఇదీ చూడండి:లాక్​డౌన్​ పాటించకపోతే రూ.6లక్షల ఫైన్‌!

ABOUT THE AUTHOR

...view details