తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐరోపా సమాఖ్య ఎన్నికల్లో బ్రిటన్​ భాగస్వామ్యం

ఐరోపా సమాఖ్య​ ఎన్నికల్లో పాల్గొనాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈయూ ఎన్నికల కంటే ముందు బ్రెగ్జిట్​ ఒప్పందం ఆమోదం పొందే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం.

'ఐరోపా సమాఖ్య ఎన్నికల్లో బ్రిటన్​'

By

Published : May 8, 2019, 5:23 AM IST

Updated : May 8, 2019, 9:13 AM IST

'ఐరోపా సమాఖ్య ఎన్నికల్లో బ్రిటన్​'

ఈ నెలలో జరిగే ఐరోపా సమాఖ్య​(ఈయూ) ఎన్నికల్లో తప్పకుండా పాల్గొనాలని బ్రిటన్​ ప్రభుత్వం తాజాగా నిర్ణయించుకుంది. ఈయూ ఎన్నికల కంటే ముందుగా బ్రెగ్జిట్​ ఒప్పందం పార్లమెంటులో ఆమోదం పొందే అవకాశం లేనందున ఆ నిర్ణయానికి వచ్చింది థెరిసా మే ప్రభుత్వం.

ఈ నెల 23న ఐరోపా సమాఖ్యకు ఎన్నికలు జరగనున్నాయి. ఈయూ నుంచి వైదొలగాలని బ్రిటన్​ ప్రజలు బ్రెగ్జిట్​ తీర్మానానికి ఓటు వేసి దాదాపు మూడు సంవత్సరాలు కావొస్తుంది. ఇప్పుడు మరోసారి ఓటింగ్​లో పాల్గొననున్నారు ఆ దేశ ప్రజలు.

బ్రిటన్​ ప్రధాని థెరిసా మే నేతృత్వంలోని కన్జర్వేటివ్​ పార్టీ... 751 స్థానాలు ఉన్న యూరోపియన్ యూనియన్​ ఎన్నికల్లో పాల్గొనకూడదని భావించింది. అయితే ఎన్నికల కంటే ముందు బ్రెగ్జిట్ ఒప్పందం ఆమోదం పొందే వీలులేనందున పాల్గొనక తప్పదని నిర్ణయించుకుంది.

థెరిసా మే ప్రతిపాదించిన బ్రెగ్జిట్​ ఒప్పందాన్ని బ్రిటన్​ చట్టసభ సభ్యులు పార్లమెంటులో పలుమార్లు తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమణ తేదీ మార్చి 29 నుంచి అక్టోబర్​ 31కు వాయిదా పడింది.

ఇదీ చూడండి: ప్రకృతి కోసం మోదీతో ఒబామా దోస్తానా..!

Last Updated : May 8, 2019, 9:13 AM IST

ABOUT THE AUTHOR

...view details