తెలంగాణ

telangana

ETV Bharat / international

'బ్రెగ్జిట్ తరువాత మెరుగైన వాణిజ్య ఒప్పందం' - donald trump

ఐరోపా సమాఖ్యతో విడిపోయిన అనంతరం బ్రిటన్​తో మెరుగైన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నామని తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. బ్రిటన్ మంత్రులు, వ్యాపారవేత్తలతో అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ ప్రధాని థెరెసా మే సంయుక్త సమావేశం నిర్వహించారు.

'బ్రెగ్జిట్ తరువాత మెరుగైన వాణిజ్య ఒప్పందం'

By

Published : Jun 4, 2019, 8:53 PM IST

Updated : Jun 4, 2019, 10:48 PM IST

'బ్రెగ్జిట్ తరువాత మెరుగైన వాణిజ్య ఒప్పందం'

బ్రెగ్జిట్ అనంతరం బ్రిటన్​తో మెరుగైన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నామని వెల్లడించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని థెరెసా మేతో కలిసి బ్రిటన్ మంత్రులు, వ్యాపారవేత్తలతో ట్రంప్ సమావేశమయ్యారు.

75 ఏళ్ల క్రితం రెండో ప్రపంచ యుద్ధం మొదలైన డీ-డే సంస్మరణ దినం, కన్జర్వేటివ్ పార్టీ నేతగా థెరెసా మే శుక్రవారం తప్పుకోనున్న నేపథ్యంలో ట్రంప్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

"మీతో కలసి పనిచేయడం మాకెంతో గౌరవం. మీ సేవలు మరువ లేనివి. మీకు అమెరికా ప్రజల తరఫున శుభాకాంక్షలు."

-థెరెసామేను ఉద్దేశించి ట్రంప్

ఐరోపా సమాఖ్య వెలుపల అత్యంత సన్నిహిత వాణిజ్య భాగస్వామిగా అమెరికాను అభివర్ణించారు థెరెసా మే.

బ్రిటన్ ప్రధాని పదవికి 13మంది పోటీ పడుతున్నారు. ప్రధానిగా మరో నేత ఎన్నికయ్యేవరకూ మే ప్రధాని బాధ్యతల్లో కొనసాగనున్నారు.

బ్రిటన్ వైఖరే కీలకం

రెండు దేశాల మధ్య సయోధ్య విషయంలో ఇరాన్, వాతావరణ మార్పులు, చైనా కంపెనీ హువావే నిర్మించనున్న 5జీ నెట్​వర్క్​పై బ్రిటన్​ వైఖరి కీలకం కానుంది.
సమావేశం ముగిసిన అనంతరం రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాటి ప్రధాని విన్​స్టన్​ చర్చిల్ మంత్రాంగం నడిపేందుకు ఉపయోగించిన గదులను ఇద్దరు నేతలు సందర్శించారు.

విందులో ఎలిజబెత్ రాణి ప్రసంగం

రెండో ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడిన భయాందోళనల నివారణే లక్ష్యంగా వివిధ అంతర్జాతీయ సంస్థలను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు ఎలిజబెత్​ రాణి. ప్రపంచాన్ని సురక్షితంగా మార్చడమే అంతర్జాతీయ సంస్థల లక్ష్యమని డొనాల్డ్​ ట్రంప్ గౌరవార్థం ఇచ్చిన విందులో స్పష్టం చేశారు.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్ మాజీ ప్రధాని విన్​స్టన్​ చర్చిల్, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్​వెల్ట్​ మధ్య జరిగిన అట్లాంటిక్ చార్టర్ ప్రతిని విందు వేదికగా ట్రంప్​నకు బహూకరించారు మే.

అధ్యక్షుడి బహుమతిని గుర్తు చేసిన మెలానియా

బ్రిటన్ పర్యటన సందర్భంగా ట్రంప్​నకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితి నుంచి మెలానియా ట్రంప్ చాకచక్యంగా తప్పించారు. గతేడాది బ్రిటన్ పర్యటనలో ట్రంప్ ఎలిజబెత్ రాణికి పొడవైన గుర్రాన్ని బహూకరించారు. ఆ ప్రతిమను చూపిస్తూ దీనిని గుర్తుపట్టారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ లేదని సమాధానమిచ్చారు. అక్కడే ఉన్న మెలానియా అది మేం ఎలిజబెత్​ రాణికి బహుకరించామని వెల్లడించారు.

ట్రంప్​నకు వ్యతిరేకంగా నిరసన

ట్రంప్ రాకకు నిరసనగా ట్రాఫాల్గర్ స్క్వేర్ సహా లండన్​ వీధుల్లో పెద్దసంఖ్యలో ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రతిపక్ష లేబర్​ పార్టీ నేత జెరెమీ కార్బిన్​, ఆయన సహచరులు ట్రంప్ రాకను తీవ్రంగా నిరసిస్తున్నామని వెల్లడించారు. నారింజ రంగులో ఉన్న డొనాల్డ్ ట్రంప్​ బొమ్మతో ఆందోళనకారులు ప్రదర్శనలు చేశారు.

ఇదీ చూడండి: మహిళలే టార్గెట్.. హత్య, ఆపై అత్యాచారం

Last Updated : Jun 4, 2019, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details