తెలంగాణ

telangana

ETV Bharat / international

వెలుగుచూసిన మూడో ఒమిక్రాన్ కేసు.. ఫేస్​ మాస్క్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం

ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న ఒమిక్రాన్ కరోనా వైరస్ కట్టడిపై బ్రిటన్​ అప్రమత్తమైంది. అక్కడ మూడో కేసు వెలుగుచూసిన నేపథ్యంలో పలు నిబంధనలు తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఫేస్​మాస్క్​ను తప్పనిసరి చేసింది.

Omicron
Omicron

By

Published : Nov 29, 2021, 5:59 AM IST

ఐరోపాలోని బ్రిటన్​లో ఒమిక్రాన్ మూడో కేసు నమోదైంది. దీనితో ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తాజా కేసు సైతం దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికుడిలోనే వెలుగుచూడటం గమనార్హం. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి లండన్​లో లేడని.. కానీ బయలుదేరే ముందు వెస్ట్‌మిన్‌స్టర్ ప్రాంతంలో కొంతసమయం ఉన్నట్లు గుర్తించినట్లు ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అందువల్ల వైరస్ వ్యాప్తి చెందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అన్ని బహిరంగ ప్రదేశాలు, ప్రజా రవాణాలో ఫేస్ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది.

మరోవైపు.. బ్రిటన్​కి వచ్చే విదేశీ ప్రయాణీకులందరూ తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలనే నిబంధనను "సాధ్యమైనంత త్వరగా" అమలు చేస్తామని ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ తెలిపారు.

ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. కఠినమైన ఆంక్షలను పాటిస్తేనే ఇప్పటివరకూ కరోనాపై సాధించిన విజయానికి అర్థం ఉంటుందన్నారు. తద్వారా రానున్న క్రిస్మస్​ను కుటుంబాలతో కలసి ఆనందంగా జరుపుకోగలమని తెలిపారు.

వ్యాక్సిన్ తీసుకున్నవారికీ ఒమిక్రాన్..

ఇంగ్లాండ్​కు వచ్చిన వారు రెండు రోజుల తర్వాత కొవిడ్ పీసీఆర్ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. ఒమిక్రాన్​ పాజిటివ్​గా తేలితే.. సన్నిహిత వ్యక్తులు 10 రోజుల పాటు క్వారంటైన్​లో ఉండాలని చెప్పారు. రెండు డోసులు తీసుకున్న వారిలోనూ ఈ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

"కొత్త వేరియంట్ గురించి మనకు ఇప్పుడే పూర్తి వివరాలు తెలియదు. మన సైంటిస్టులు దీని గురించి తెలుసుకుంటున్నారు. అయితే, ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. డబుల్ వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారికీ ఈ వేరియంట్ సోకే అవకాశం ఉంది."

మరోవైపు.. బ్రిటన్​లో 39,567 రోజువారీ కరోనా కేసులు కేసులు వెలుగుచూశాయి. మరో 131 మరణాలు నమోదయ్యాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details