తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫ్యాషన్​కు చిరునామా బ్రిటన్ ప్రధాని థెరెసా మే - బ్రిటన్

బ్రిటన్​ ప్రధాని థెరెసా మే... ఐరోపా సమాఖ్య నుంచి బయటపడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. దేశాధినేతగా నిత్యం ప్రధాన వార్తల్లో ఉండే ఆమె శైలికి చాలామందే అభిమానులు ఉన్నారు. థెరెసా ధరించే దుస్తులు ఆమెకు ఫ్యాషన్​పై ఉన్న ఆసక్తిని కళ్లకు కడుతుంది. అందుకే రాజకీయ నాయకురాలైనా ప్రముఖ మ్యాగజైన్​ 'వోగ్​' ముఖచిత్రంపై మెరిశారు థెరెసా.

థెరెసా

By

Published : Mar 25, 2019, 8:34 AM IST

ఫ్యాషన్​కు చిరునామా బ్రిటన్ ప్రధాని థెరెసా మే
ఐరోపా సమాఖ్య నుంచి బయటపడేందుకు బ్రిటన్ ప్రధాని థెరెసా మే పెద్ద పోరాటమే చేస్తున్నారు. నిత్యం వార్తల్లో నిలిచే థెరెసాకు ఫ్యాషన్​ పైనా ఆసక్తి ఎక్కువే. అందుకే రాజకీయాల్లో ఉన్నా అమెరికన్ ప్రఖ్యాత మ్యాగజైన్ ​'వోగ్​' ముఖచిత్రంపై తళుక్కుమన్నారు. దుస్తుల ఎంపిక, అలంకరణ, మాట్లాడే తీరు థెరెసాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అలా కొన్ని పరిశీలిస్తే...

లండన్​లోని మేడమ్ టుస్సాడ్స్​లో థెరెసా మైనపు విగ్రహాన్ని 2017లో ఆవిష్కరించారు. థెరెసా శైలిని విగ్రహంలో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. భిన్న రకాల అలంకరణల్లో ఆమె ధరించే నెక్లెస్​ల​దే ప్రధాన పాత్ర. ఇటాలియన్​ ఆభరణాల సంస్థ 'మిర్టా' తయారు చేసే ముత్యాలు, మణులు, గొలుసులను ఆమె ఎంతగానో ఇష్టపడతారు.

ఇంగ్లండ్, ఐరోపా తరహా వాతావరణానికి వెచ్చని దుస్తులకు ప్రాధాన్యం ఇస్తారు. పెద్ద కాలర్​ ఉండే సూట్​ను ఎక్కువగా ధరిస్తారు థెరెసా.

ఒకసారి వేసుకున్న దుస్తులను మరోసారి వేసుకునేందుకు థెరెసాకు మొహమాటం ఉండదు. బ్రస్సెల్స్​ సమావేశంలో ఆమె వేసుకున్న నీలిరంగు సూటును ఇది వరకూ ఎన్నో సార్లు ధరించారు.

ఎవరైన ముఖ్యమైన వ్యక్తులు వస్తే వినూత్నంగా స్వాగతం పలుకుతారు థెరెసా. కార్యాలయం బయట రహదారి పైకి వచ్చి మరీ అతిథులను రాయల్​గా ఆహ్వానిస్తారు. విధుల్లో భాగంగా సందర్భాన్ని బట్టి ప్రత్యేక దుస్తులు ధరిస్తారు. ఎంతగా ఫ్యాషన్​ను అనుసరించినా థెరెసా అలంకరణ ఎప్పుడూ వివాదాస్పదం కాకపోవటం కొసమెరుపు.

ఇదీ చూడండి:లివైజ్​​ జీన్స్​తో పాటు షేర్లకూ డిమాండ్​ ఎక్కువే..!

ABOUT THE AUTHOR

...view details