లండన్ కెన్సింగ్టన్లోని సిలోన్ స్ట్రీట్లో ఉంది ఆ ఇల్లు. దాని వెడల్పు నాలుగు అడుగులు. మొత్తం మీద 1,587 చదరపు అడుగుల్లో ఆ నివాసాన్ని నిర్మించారు. ఇప్పుడది రూ. 17.5కోట్లు పలుకుతోంది.
మొత్తం బ్రిటన్ రాజధానిలోనే అత్యంత ఇరుకైన నివాసంగా గుర్తింపు పొందిన ఆ ఇల్లు.. రెండు ఇళ్ల మధ్య కుక్కినట్టుగా ఉంటుంది. బయటి నుంచి చూస్తే.. ఇలా ఉందేంటి? అని అనుకుంటారు. కానీ "డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్" అనే ఆంగ్ల సామెతకు ఇది ఉదాహరణగా ఉంటుంది. సాధారణ నివాసంలో ఉండాల్సిన అన్ని సదుపాయాలు ఇందులో ఉన్నాయి. మూడు బెడ్రూంలు, డైనింగ్ హాల్, రిసెప్షన్ రూం, ఆధునిక కిచెన్ సౌకర్యాలు ఇందులో ఉండటం విశేషం. ఇక పైన ఫ్లోర్లో స్టడీ రూం కూడా ఉంది. దానినే ఆఫీస్ రూంలా కూడా వాడుకోవచ్చు. ఓ బాత్రూం కూడా ఉంది. ఇంటి పై నుంచి కింది వరకు గాజుతో చేసిన విండోలు ఉన్నాయి. ఇక వెనకాలి భాగంలో ఓ గార్డెన్ కూడా ఉండటం మరో ప్రత్యేకత.