మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించారు ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రాంకీ జపాటా అనే ఆవిష్కర్త. తాను సృష్టించిన హోవర్‌బోర్డ్ అనే యంత్రం సహాయంతో పక్షిలా ఎగురుతూ ఫ్రాన్స్ నుంచి ఇంగ్లాండ్ చేరుకుని చరిత్ర సృష్టించారు 40 ఏళ్ల జపాటా.
ఫ్రాన్స్‌లోని సాంగెట్లో బయల్దేరి ఇంగ్లీష్ ఛానల్ మీదుగా బ్రిటన్‌లోని సెయింట్ మార్గరేట్లో సురక్షితంగా దిగారాయన. మొత్తం 35 కిలోమీటర్ల ప్రయాణాన్ని.. 22 నిమిషాల్లో పూర్తి చేశారు. మధ్యలో ఒక సారి ఇంధనం నింపుకునేందుకు కిందకు దిగారు. 5 చిన్నపాటి జెట్ ఇంజిన్లున్న ఈ హోవర్‌బోర్డు కిరోసిన్‌తో పనిచేస్తుంది.