తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఉగ్రవాదం.. మానవాళికి అతిపెద్ద ముప్పు' - భారత విదేశాంగ మంత్రి

ఉగ్రవాదం ఎప్పుడూ సమర్థనీయం కాదని మానవ హక్కుల కోసం పోరాడే సంస్థలు గ్రహించాలని హితవు పలికారు విదేశాంగ మంత్రి జైశంకర్. ఐరాస మానవ హక్కుల మండలి​ సమావేశంలో వర్చువల్​గా పాల్గొని ప్రసంగించారు.

Terrorism continues to be one of the gravest threats to humankind: Jaishankar
'మానవాళికి అతిపెద్ద ముప్పు.. ఉగ్రవాదం'

By

Published : Feb 23, 2021, 7:07 PM IST

మానవాళికి అతిపెద్ద ముప్పుగా ఉగ్రవాదం కొనసాగుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్​. జైశంకర్ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం ఎప్పుడూ సమర్థనీయం కాదని మానవ హక్కుల సంస్థలు గ్రహించాలన్నారు. ఐరాస మానవ హక్కుల మండలి 46వ ​సమావేశంలో వర్చువల్​గా పాల్గొని ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారు.. బాధితులతో సమానం కాదని పరోక్షంగా పాక్​ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

" ఉగ్రవాద బాధిత దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగే పోరాటంలో భారత్​ ముందు వరుసలో నిలుస్తూ వస్తోంది. ఉగ్రవాదాన్ని అంతం చేసే దిశగా 8 సూత్రాల కార్యాచరణ ప్రణాళికను గత నెల ఐరాసకు అందించింది భారత్​. ఈ విధానాన్ని అమలు చేసేందుకు మేము ఇతర దేశాలతో కలిసి పనిచేస్తాం."

-- ఎస్​. జైశంకర్​, భారత విదేశాంగ మంత్రి

కరోనా కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయన్నారు జైశంకర్. ప్రపంచ దేశాలు ఈ మహమ్మారిని కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.

కరోనాపై పోరులో వేర్వేరు దేశాలకు భారత్​ చేసిన సాయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు జైశంకర్.

ఇదీ చదవండి :' 'కొవాక్స్' కోసం భారత్​ 1.1 బిలియన్ డోసులు'

ABOUT THE AUTHOR

...view details