అల్బేనియాలో తీరం వెంబడి ఇవాళ పలుమార్లు సంభవించిన భూకంపాల ధాటికి ఆరుగురు మృతి చెందారు. మరో 300 మంది క్షతగాత్రులయ్యారు.
దేశ రాజధాని తిరానాకు వాయువ్యాన 30 కిలోమీటర్ల దూరంలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైంది. మరో రెండు భూకంపాలు 5.1, 5.4 తీవ్రతతో సంభవించాయి.
భారీ విధ్వంసం
భూకంపం ధాటికి పదుల సంఖ్యలో భవనాలు కూలిపోయాయి. తుమనే పట్టణంలోని విద్యుత్ కేంద్రం ధ్వంసమైంది. శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను భద్రతా దళాలు రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లు విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.