తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫ్రెంచ్ స్పైడర్​మ్యాన్​.. రయ్​మని ఎక్కేస్తున్నాడు

ఫ్రెంచ్ స్పైడర్​మ్యాన్​గా పేరు తెచ్చుకున్న అలెన్​ రాబర్ట్​... పారిస్​లోని లా డిఫెన్స్​ టవర్​ను ఎక్కాడు. 145 మీటర్ల ఎత్తును 45 నిమిషాల్లోనే అధిరోహించాడు.

By

Published : Mar 26, 2019, 6:34 PM IST

ఫ్రెంచ్ స్పైడర్​మ్యాన్

ఫ్రెంచ్ స్పైడర్​మ్యాన్
స్పైడర్​మ్యాన్.. నేటితరం వారికి బాగా సుపరిచితం. పెద్ద పెద్ద భవనాలపై పాకుతూ అమాంతం దూకేస్తూ.. ప్రజలను రక్షిస్తుంటాడు. ఈ సాలీడు మనిషినే ఫాలో అయినట్టున్నాడు ఫ్రాన్స్​కి చెందిన అలెన్ రాబర్ట్. పారిస్​లోని లా డిఫెన్స్ టవర్​ని పాకుతూ ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 145 మీటర్ల ఎత్తున్న ఈ టవర్​ను కేవలం 45 నిమిషాల్లో ఎక్కేశాడు రాబర్ట్. దీంతో అందరూ ఇతడిని ఫ్రెంచ్ స్పైడర్​మ్యాన్ అని పిలుస్తున్నారు.

అలెన్​కి పెద్ద పెద్ద భవనాలు ఎక్కడం ఇది మొదటిసారి కాదు. ప్రపంచంలో ఎత్తైన భవనమైన బుర్జ్​ ఖలిఫాను 2011లోనే ఎక్కేశాడు. 2016లో బార్సిలోనాలో ఎత్తైన టవరైన టొర్రె అగ్బార్​ని అధిరోహించాడు. న్యూయర్క్​లోని ఎంపైర్​ స్టేట్ బిల్డింగ్, తైవాన్​లోని తైపీ 101, మలేషియాలోని పెట్రోనస్​ టవర్స్​నీ గతంలోనే ఎక్కాడు.

ABOUT THE AUTHOR

...view details